తెలంగాణ

telangana

ETV Bharat / international

స్వతంత్ర భారత్​ విజయాలు భళా అంటూ బైడెన్, పుతిన్​ సందేశాలు - joe biden wishes

భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని కీర్తించారు జో బైడెన్​. మరోవైపు ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు.

World leaders laud India
భారత్​కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

By

Published : Aug 15, 2022, 4:25 PM IST

76 th Independence day of India: 76వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ భారత ప్రజలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా-భారత్‌ సహజ భాగస్వాములన్న బైడెన్‌.. భవిష్యత్తులో ఆ బంధం మరింత బలోపేతం చేస్తామన్నారు. భారత ప్రజాస్వామ్య ప్రయాణాన్ని కీర్తించిన బైడెన్‌.. మహాత్మా గాంధీ ప్రభోదించిన సత్యం, అహింస సిద్ధాంతాన్ని గుర్తు చేసుకున్నారు. సవాళ్ల పరిష్కారంలో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌-అమెరికా పరస్పరం సహకరించుకుంటాయని తెలిపారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన బంధం వల్ల అమెరికా-భారత్‌ భాగస్వామ్యం బలపడిందని బైడెన్‌ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో కలిసి ఉజ్వల భవిష్యత్తు నిర్మిస్తామని బ్లింకెన్‌ అన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత్​కు 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్​.. ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం గుర్తించే విజయాలను సాధించిందని అన్నారు పుతిన్​. ఇతర రంగాల్లోనూ భారత్​ ప్రతిష్ఠ.. ప్రపంచ వేదికపై గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.. భారత్​కు 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అన్నారు మేక్రాన్​. 75 ఏళ్లలో భారత్ సాధించిన అద్భుత విజయాలకు అభినందనలు‌ తెలియజేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్​ పక్షాన ఫ్రాన్స్ ఉంటుందని వెల్లడించారు మేక్రాన్.

మరోవైపు మాల్దీవుల విదేశాంగ మంత్రి, అబ్దుల్లా షాహిద్ కూడా భారత్​కు 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్- మాల్దీవుల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అభివృద్ధి చెందుతుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు అబ్జుల్లా.

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ అల్బనీస్‌ తన భారత పర్యటనల గురించి మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. భారత్​కు 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అల్బనీస్. గౌరవం, స్నేహం, సహాకారం స్పూర్తితో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అల్బనీస్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. భారత్ ​సాధించిన విజయాలు అద్భుతమైనవని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అన్నారు. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి డాక్టర్ నారాయణ్ ఖడక్ కూడా భారత్ 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చదవండి:కోహినూర్‌ సహా ఆంగ్లేయులు కొల్లగొట్టినవెన్నో

అగ్రరాజ్యం తగ్గేదేలే, తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం

ABOUT THE AUTHOR

...view details