తెలంగాణ

telangana

ETV Bharat / international

లక్కీ మ్యాన్.. పొరపాటుగా ఖాతాలోకి 330 రెట్లు ఎక్కువ జీతం.. ఏం చేశాడంటే?

ఎప్పటిలాగే నెలాఖరున పడే జీతం కోసం ఎదురుచూశాడు ఆ ఉద్యోగి. ఇంతలో అతనికి జీతం పడినట్టు మెసేజ్​ వచ్చింది. కానీ ఆ మెసేజ్​ చూసేసరికి అతనికి నోటమాట రాలేదు. ఎందుకంటే అతని ఖాతాలో ఎప్పుడూ వచ్చే మొత్తం కన్నా 330 రెట్లు ఎక్కువ పడింది. మరి ఇలా అదృష్టం తలుపు తడితే అతను ఏం చేశాడో తెలుసా?

ఉద్యోగి
ఉద్యోగి

By

Published : Jul 3, 2022, 6:26 AM IST

లాటరీ ద్వారా పలువురు భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్న సంఘటనల గురించి వింటుంటాం. కానీ ఇక్కడ ఓ ఉద్యోగికి కంపెనీనే జాక్​పాట్​ ఇచ్చినట్లు అయింది. ఇది పొరపాటుగా జరిగినా అతనికి మాత్రం లైఫ్​టైం సెటిల్​మెంట్​ అయింది. అతనికి ఎప్పుడు వచ్చే జీతం కంటే 330 రెట్లు ఎక్కువ మొత్తం ఖాతాలో పడింది. దొరికిందే అవకాశమని భావించిన ఆ ఉద్యోగి.. సంస్థకు రిజైన్​ చేసి పరారయ్యాడు. ఈ ఘటన దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో జరిగింది. ఇంతకీ అతని జీతం ఎంతో తెలుసా? 5,00,000 చిలియన్​ పెసోస్​ (రూ.43,028).. అయితే అతనికి వచ్చిన మొత్తం మాత్రం 165,398,851 చిలియన్​ పెసోస్​ (రూ.1.42 కోట్లు).

స్థానిక మీడియా ప్రకారం.. మాంసాహార ఉత్పత్తి సంస్థ సీఐఏఎల్​ అలిమెంటోస్​ చెందిన ఆ ఉద్యోగికి మే 30న ఈ భారీ మొత్తంలో జీతం పడింది. అది గమనించిన ఆ ఉద్యోగి.. ఈ విషయాన్ని తన డిప్యూటీ మేనేజర్​తో చెప్పాడు. అలా యాజమాన్యానికి ఈ విషయం తెలిసింది. ఉద్యోగిని సంప్రదించిన సంస్థ యాజమాన్యం.. బ్యాంకుకు వెళ్లి ఆ డబ్బును మళ్లీ రిటర్న్​ చేయాల్సిందిగా కోరింది. అందుకు ఆ ఉద్యోగి కూడా సరే అన్నాడు. కానీ ఇంత నిజాయతీ పనికిరాదు అనుకున్నాడో ఏమో.. మరుసటి రోజు నుంచి మూడు రోజుల పాటు యాజమాన్యానికి స్పందించడం మాననేశాడు. ఆ తర్వాత రోజు తన లాయర్​ ద్వారా రాజీనామా లేఖను అందించి పరారయ్యాడు. అప్పటి నుంచి ఆ ఉద్యోగి ఆచూకీ లేదని స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు ఉద్యోగిపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ చూడండి :'వచ్చే పదేళ్లలో కోటి మందికి బాల్యవివాహాలు.. అదే కారణం!'

ABOUT THE AUTHOR

...view details