తెలంగాణ

telangana

ETV Bharat / international

పెళ్లి కోసం ప్రేయసి పక్కా ప్లాన్​.. ప్రియుడి కండోమ్​కు రంధ్రాలు.. చివరకు... - పార్ట్​నర్​ కండోమ్​

జర్మనీలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియుడు తననే పెళ్లి చేసుకోవాలని అతడికి తెలియకుండా.. కండోమ్​కు రంధ్రాలు చేసింది ఓ మహిళ. తర్వాత గర్భం దాల్చినట్లు అతడికి మెసేజ్​ చేసింది. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. అసలేం జరిగిందంటే?

Woman secretly pokes hole in partner's condoms, booked for 'stealthing'
Woman secretly pokes hole in partner's condoms, booked for 'stealthing'

By

Published : May 6, 2022, 11:50 AM IST

Woman Secretly Pokes Hole in Partner Condom: ఆ ఇద్దరూ రిలేషన్​లో ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితం.. ఆ ఒక్క దురాలోచనతో ఊహించని మలుపులు తిరిగింది. తన ప్రియుడి కండోమ్​కు రంధ్రాలు చేసి.. చిక్కుల్లో పడింది ఓ మహిళ. సెక్స్​ చేస్తున్న సమయంలో అతడికి తెలియకుండా.. ఈ చర్యకు పాల్పడింది. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. పశ్చిమ జర్మనీలోని బీల్​ఫెల్డ్​లో ఈ ఘటన వెలుగుచూసింది.

ఇదీ జరిగింది: 39 ఏళ్ల ఓ మహిళ.. 42 ఏళ్ల వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఇద్దరికీ గతేడాది ఆన్​లైన్​లో పరిచయమైంది. ప్రేమ చిగురించింది. శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారు. అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అతడి పట్ల విపరీతమైన ప్రేమను పెంచుకున్న మహిళ.. ఆ వ్యక్తి తనను పెళ్లి చేసుకోడని భావించింది. అప్పుడే ఓ ప్లాన్​ వేసింది. గర్భం దాలిస్తే ఎలాగైనా తననే పెళ్లి చేసుకుంటాడు కదా అనుకుంది. సెక్స్​ సమయంలో అతడికి తెలియకుండా కండోమ్​కు రంధ్రాలు చేసింది. ఆ తర్వాత అతడికి మెసేజ్​ చేసింది. 'నేను ప్రెగ్నెంట్​నని అనిపిస్తోంది. కండోమ్​ను ఉద్దేశపూర్వకంగా పాడుచేశాను.' అని చెప్పింది.

ఇది విన్న ప్రియుడు కోర్టుకు వెళ్లాడు. ఆమెపై నేరారోపణలు మోపాడు. అతడి అభ్యర్థనను పరిశీలించిన జర్మన్​ కోర్టు.. ఆ మహిళ 'స్టెల్తింగ్'​ నేరానికి పాల్పడినట్లు పేర్కొంది. ఇది లైంగిక దాడి కిందికే వస్తుందని.. ఆ మహిళకు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఒక వ్యక్తి తన భాగస్వామికి తెలియకుండా లైంగిక చర్య సమయంలో.. తన కండోమ్‌ను రహస్యంగా తీసివేస్తే దానిని 'స్టెల్తింగ్​'గా పరిగణిస్తారు. జర్మనీలో వెలుగుచూసిన ఈ కేసును చారిత్రకంగా అభివర్ణిస్తున్నారు. తొలిసారి ఓ మహిళ స్టెల్తింగ్​కు పాల్పడటమే ఇందుకు కారణం.

ఇవీ చూడండి: చైనాలో లాక్‌డౌన్‌ దారుణాలు: క్రూరంగా కొవిడ్‌ టెస్టులు.. ఇంట్లోనే బంధిస్తూ..!

ABOUT THE AUTHOR

...view details