తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్‌లో తరచూ 'విమాన' ప్రమాదాలు ఎందుకు? కారణాలవేనా! - nepal latest craft

నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా యతి ఎయిర్‌లైన్స్‌ విమానం పొఖారా విమానాశ్రయం వద్ద కుప్పకూలి 72 మరణించడంతో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అసలు నేపాల్​లో ఎందుకు ఎక్కువగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి? కారణాలేంటి?

nepal
nepal

By

Published : Jan 16, 2023, 10:27 PM IST

Updated : Jan 17, 2023, 9:16 AM IST

హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా యతి ఎయిర్‌లైన్స్‌ విమానం పొఖారా విమానాశ్రయం వద్ద కుప్పకూలి 72 మరణించడంతో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రమాదం నేపాల్‌ చరిత్రలోనే మూడో అతిపెద్ద దుర్ఘటన. ఇక్కడ విమాన ప్రమాదాలకు భౌగోళిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి.

మారుమూల ప్రాంతాల్లోని రన్‌వేలు..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రన్‌వేలు నేపాల్‌లో ఉన్నాయి. ముఖ్యంగా 'లుకుల' వంటి ప్రమాదకరమైన రన్‌వేలపై విమానాలు దింపడం నిపుణులైన పైలట్లకు కూడా చాలా కష్టం. మౌంట్‌ ఎవరెస్ట్‌కు వెళ్లే వారికి ఈ ఎయిర్‌ పోర్టే చాలా కీలకం. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో పర్వాతాల మధ్యలో ఈ ఎయిర్‌ పోర్టు ఉంటుంది. ఇక్కడ రన్‌వే చాలా చిన్నది. దీని పొడవు కేవలం 527 మీటర్లు మాత్రమే. ప్రపంచంలోనే 14 అత్యంత కఠిన పర్వతాల్లో 8 నేపాల్‌లోనే ఉన్నాయి. వీటిల్లో ఎవరెస్ట్‌ కూడా ఒకటి.

వేగంగా మారిపోయే వాతావరణం..
నేపాల్‌ పర్వత ప్రాంతం కావడంతో ఇక్కడ వాతావరణం చాలా వేగంగా మారిపోతుంది. దీనికి తోడు ఎయిర్‌పోర్టులు పర్వతాలపై సముద్ర మట్టానికి ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీంతో విమానాల ఇంజిన్ల సామర్థ్యం తగ్గిపోతుంది. హఠాత్తుగా వాతావరణం మారితే మార్గం కనిపించడం కష్టమైపోతుంది. దీనికి గాలి సాంద్రతలో తేడాలు కూడా జతకలిసి ప్రయాణాన్ని కఠినంగా మార్చేస్తాయి. ఇక్కడ వాడే చాలా పాత విమానాల్లో వీటిని తట్టుకొనే టెక్నాలజీలు లేవు. బ్రిటన్‌ వంటి దేశాలు దౌత్య కార్యాలయాలు నేపాల్‌లో ప్రయాణించే తమ దేశస్థులకు ముందస్తు సూచనలు కూడా జారీ చేస్తుంటాయి. ఇక్కడ వాతవరణం దెబ్బకు చిన్నవిమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతుంటాయి.

కాలం చెల్లిన టెక్నాలజీ..
ప్రపంచంలోని పేద దేశాల్లో నేపాల్ ఒకటి. ఇక్కడ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలు దేశీయ ప్రయాణాలకు పాత విమానాలనే వాడతాయి. అనుకోని సమస్యలు ఎదురైతే తట్టుకొనేలా అత్యాధునిక వాతావరణ రాడార్లు, జీపీఎస్‌ టెక్నాలజీ వంటివి వీటిల్లో ఉండవు. అక్కడ ఇప్పటికీ దశాబ్దాల నాటి విమానాలు వినియోగిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ నేపాల్‌తో కలిసి పనిచేస్తోంది.

Last Updated : Jan 17, 2023, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details