WHO On Covid 19: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య గతవారం 40 శాతం పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. భారత్, అమెరికా సహా పలు దేశాల్లో కొవిడ్ మరణాల లెక్కలు సవరించిన నేపథ్యంలో ఈ సంఖ్యలో పెరుగుదల కనిపించినట్లు అభిప్రాయపడింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపింది.
కేసులు తగ్గినా.. భారీగా పెరిగిన కరోనా మరణాలు- కారణం అదేనా? - WHO latest news
WHO On Covid 19: కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గత వారం 40శాతం పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అయితే కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గుతూ వస్తోందని తెలిపింది.
40శాతం పెరిగిన కరోనా మరణాలు
గతవారం దాదాపు కోటి మందికి వైరస్ సోకగా.. 45వేల మందికి పైగా మరణించినట్లు డబ్ల్యూహెచ్ఓ.. నివేదికలో స్పష్టం చేసింది. పలు దేశాలు కొవిడ్ పరీక్షలను తగ్గించడం, కరోనా కట్టడి చర్యలను విస్మరించడంపై ఆందోళన వ్యక్తంచేసింది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇదీ చూడండి:నానో రేణువులతో కొవిడ్ టీకా.. భవిష్యత్ మహమ్మారులకూ చెక్!