తెలంగాణ

telangana

ETV Bharat / international

చికెన్​ వండేటప్పుడు అలా కడుగుతున్నారా? అయితే కష్టమే! - నీటిధారలో చికెన్​ కడగటం

వండటానికి ముందు చికెన్​ను నీటిధారలో కడుగుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే. అలా చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఏం చెబుతున్నారంటే..

chicken wash
chicken wash

By

Published : Jan 8, 2023, 7:31 AM IST

వండటానికి ముందు చికెన్‌ను నీటిధార కింద పెట్టి కడగడం వల్ల ఆ తుంపర్లు వంటగది అంతా చిమ్మి ప్రమాదకరమైన కాంపైలోబాక్టర్‌, సాల్మొనెల్లా అనే బాక్టీరియాలు వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి అనేక రకాల వ్యాధులకు కారణమవుతాయి కాబట్టి ఇలా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నా చాలా మంది మానుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియా ఫుడ్‌ సేఫ్టీ ఇన్ఫర్మేషన్‌ కౌన్సిల్‌ జరిపిన సర్వేలో ఇది మరోసారి రుజువైంది. ఇక్కడి జనాభాలో సగం మందికి పైగా చికెన్‌ను నీటి ధారలో కడుగుతున్నారు. దీనివల్ల గడిచిన 20 ఏళ్లలో ఆస్ట్రేలియాలో కాంపైలోబాక్టర్‌, సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్‌లు రెట్టింపు అయినట్లు తెలిపారు. అత్యాధునిక మార్గాల్లో మాంసం ఉత్పత్తి చేస్తున్న ఈ రోజుల్లో చికెన్‌ను కడగాల్సిన అవసరం లేదని, ఒక వేళ పాత అలవాటును మానుకోలేకపోతే పట్టి ఉంచిన నీటిలో ముంచి కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అనంతరం శుభ్రమైన పొడి వస్త్రంతో మాంసాన్ని బాగా తుడిచి, దానిని సురక్షిత ప్రదేశంలో ఉంచాలని సలహా ఇస్తున్నారు. మరికొంత మంది వెనిగర్‌, నిమ్మ రసాలతో చికెన్‌ను శుభ్రం చేస్తారని, దీని వల్ల కూడా ఉపయోగం లేదని తెలిపారు. ఈ విధానంలోనూ బాక్టీరియా వ్యాప్తి చెందుతుందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details