Vladimir Putin health conditions: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని, రక్త కేన్సర్‌తో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ వెల్లడించారు. దీనిని ఉక్రెయిన్ యుద్ధంతో ముడిపెడుతూ అమెరికాకు చెందిన ఒక మేగజీన్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 'కచ్చితంగా ఆయన అనారోగ్య సమస్య ఏమిటనేది తెలియదు. అది నయమయ్యేదేనా, కాదా అనేదీ తెలియదు. కానీ యుద్ధ సమీకరణాల్లో అదీ ఒక భాగమే. రష్యా నుంచి, ఇతర చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం పుతిన్ చాలా తీవ్ర అస్వస్థతతో ఉన్నారు' అని చెప్పారు.
'పుతిన్‌కు రక్త కేన్సర్.. తీవ్ర అస్వస్థత' - ఉక్రెయిన్ యుద్ధం
Vladimir Putin health conditions: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్త కేన్సర్‌తో బాధపడుతున్నారని, తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ తెలిపారు. ఈ విషయాన్ని రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి ఒకరు ధ్రువీకరించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి ఒకరు కూడా పుతిన్ అనారోగ్యం గురించి ధ్రువీకరించారు. కేన్సర్ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు శస్త్రచికిత్స జరిగిందని, ఉక్రెయిన్‌పై యుద్ధ ప్రకటనకు ముందు ఇది చోటు చేసుకుందని తెలిపారు. పుతిన్ ‘వెర్రి’ నిర్ణయంతో ప్రపంచమంతా ఇబ్బందులు పడుతోందని చెప్పారు. ఆయనకు పుతిన్‌తో సన్నిహిత సంబంధం ఉంది.
ఇదీ చూడండి:'రష్యా దళాల మందగమనం.. యుద్ధంలో ఉక్రెయిన్‌దే విజయం!'