సోమాలియాలో అమెరికా చేపట్టిన మిలిటరీ దాడుల్లో ఇస్లామిస్ట్ అల్ శబాబ్కు చెందిన దాదాపు 30 మంది తీవ్రవాదులు చనిపోయారు. ఈ ఘటన సెంట్రల్ సోమాలియాలోని గాల్కాడ్ అనే టౌన్ సమీపంలో జరిగింది. ఈ మేరకు యూఎస్ ఆఫ్రికా కమాండ్ వివరాలు వెల్లడించింది. 'అల్ఖైదాతో సంబంధమున్న అల్ శబాబ్ సంస్థకు చెందిన 100 మందికి పైగా తీవ్రవాదులు దాడులు చేశారు. వారిని నిలువరించేందుకు ఆత్మరక్షణ చర్యగా సోమాలియా నేషనల్ ఆర్మీతో కలిసి యూఎస్ దాడులు చేసింది' అని ఓ యూఎస్ ఆఫ్రికా పేర్కొన్నట్లుగా ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాల ద్వారా తెలుస్తోంది.
అమెరికా సైన్యం దాడులు.. 30 మంది తీవ్రవాదులు మృతి - Al Shabaab america somalia
సోమాలియాలో అమెరికా చేపట్టిన మిలిటరీ దాడుల్లో అల్ శబాబ్ తీవ్రవాద సంస్థకు చెందిన 30 మంది చనిపోయారు. తీవ్రవాద సంస్థకు చెందిన 100 మందికి పైగా మిలిటరీపై చేసిన దాడులకు ఆత్మరక్షణగా ఈ దాడులు చేశామని అధికారులు వెల్లడించారు.
అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ చేసిన విజ్ఞప్తి మేరకు సోమాలియా మిలిటరీకి సపోర్ట్ అందిస్తోంది యూఎస్. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు మే 2022 నుంచి దాదాపు 500 ట్రూపులు సోమాలియాలో మోహరించింది యూఎస్. కాగా, సోమాలియా నుంచి సైన్యాన్ని వెనక్కు పంపించాలని 2020లో డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. 'ఆఫ్రికా ఖండంలో కెల్లా సోమాలియా స్థిరంగా, భద్రతకు కేంద్రంగా ఉంది. అల్ఖైదాతో సంబంధమున్న అల్ శబాబ్ను ఎదుర్కొనేందుకు అమెరికా.. తన భాగస్వామి సైన్యానికి సపోర్ట్ అందిస్తుంది. శిక్షణ, సలహాలు ఇస్తుంది.' అని యూఎస్ మిలిటరీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఇటీవల కాలంలో అమెరికా చాలా దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా మంది అల్ శబాబ్ ఉగ్రవాదులు మృతిచెందారు. గతేడాది అక్టోబర్లో అమెరికా చేసిన దాడుల్లో ఇద్దరు అల్ శబాబ్ ఉగ్రవాదులు మృతిచెందారు. అంతకముందు నవంబర్లో యూఎస్ జరిపిన దాడుల్లో 17 మంది టెర్రరిస్టులు మరణించారు. ఇక డిసెంబర్ చివరలో జరిగిన దాడుల్లో ఆరుగురు తీవ్రవాదులను అమెరికా సైన్యం హతమార్చింది.