తెలంగాణ

telangana

ETV Bharat / international

విన్యాసాలు చేస్తూ ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఆరుగురు దుర్మరణం - డల్లాస్​ లేటెస్ట్​ న్యూస్​

రెండో ప్రపంచ యుద్ధ స్మారకంగా ఏర్పాటు చేసిన ఎయిర్​ షోలో భాగంగా విన్యాసాలు చేస్తున్న రెండు సైనిక విమానాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్​లో జరిగింది.

dallas air show crash
dallas air show crash

By

Published : Nov 13, 2022, 9:49 AM IST

Updated : Nov 13, 2022, 12:28 PM IST

అమెరికా డల్లాస్​లో ఏర్పాటు చేసిన ఎయిర్​ షోలో ఘోర ప్రమాదం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధ స్మారకంగా ఏర్పాటు చేసిన ఎయిర్​ షోలో భాగంగా విన్యాసాలు చేస్తున్న రెండు సైనిక విమానాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. శనివారం మధ్యాహ్నం సుమారు 1.20 సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది హుటాహుటిన విమానాశ్రయం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది అమెరికా ప్రభుత్వం.

ఎయిర్​ క్రాఫ్ట్​ దగ్ధమవుతున్న విజువల్స్​

విమానంలో ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే సాధారణంగా B-17 ఫ్లైయింగ్ ఫోర్ట్రెస్ బాంబర్​లో నలుగురు నుంచి ఐదుగురు సిబ్బంది ఉంటారని.. P-63 కింగ్‌కోబ్రా యుద్ధ విమానంలో మాత్రం ఒక పైలట్‌ మాత్రమే ఉంటారని ఎయిర్‌షో నిర్వాహకులు హాంక్ కోట్స్ తెలిపారు. విమానంలో ప్రయాణికులు లేరని.. విమానాలు కూడా వైమానిక దళానికి చెందినవని ఆయన అన్నారు. విమానాలను అత్యంత శిక్షణ పొందిన పైలట్లే నడుపుతారని హాంక్​ పేర్కొన్నారు.

కుప్పకూలిన విమానం
Last Updated : Nov 13, 2022, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details