తెలంగాణ

telangana

ETV Bharat / international

మాల్​ ఫుడ్​ కోర్ట్​లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి - us shooting news shooter

US SHOOTING 4 killed in shooting at Indiana mall, 2 injured, police say
US SHOOTING 4 killed in shooting at Indiana mall, 2 injured, police say

By

Published : Jul 18, 2022, 6:54 AM IST

Updated : Jul 18, 2022, 7:28 AM IST

06:48 July 18

మాల్​ ఫుడ్​ కోర్ట్​లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

Indiana Mall Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం సాయంత్రం ఇండియానా మాల్​లోని ఫుడ్​ కోర్టులో ప్రవేశించిన ఓ సాయుధుడు రైఫిల్​తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు సహా నలుగురు మరణించారు. మొదట దుండగుడు ముగ్గురు పౌరులను కాల్చిచంపగా.. అనంతరం ఓ పౌరుడు నిందితుడిని కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలైనట్లు పేర్కొన్నారు.

ఈ కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన మాల్​కు చేరుకున్నారు. మాల్​లోని బాత్​రూమ్​లో అనుమానస్పదంగా ఓ బ్యాగు కనిపించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టామన్నారు. అనేక ఆయుధాలతో మాల్​లోకి ప్రవేశించిన సాయుధుడు.. కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు.

అమెరికాలో కాల్పుల ఘటనలు అధికం కావడం వల్ల తుపాకీ నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే​ తెలిపారు. 18-21 ఏళ్ల మధ్య వయసున్న వారు తుపాకులు కొనుగోలు చేయకుండా చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంతో ఎవరి హక్కులకు భంగం కలిగించడం తమ ఉద్దేశం కాదని.. ఇది ప్రజల రక్షణ కోసమేనని బైడెన్​ చెప్పారు.

ఇవీ చదవండి:

21 వాహనాలు పరస్పరం ఢీ.. ఆరుగురు దుర్మరణం.. కి.మీ. మేర ట్రాఫిక్​జామ్​

నడిసంద్రంలో 18గంటల పోరాటం.. ఆటబొమ్మ సాయంతో...

Last Updated : Jul 18, 2022, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details