US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కొలంబియాలోని ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన ఈ కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొలంబియానా సెంటర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
షాపింగ్‌మాల్‌లో కాల్పుల కలకలం.. 12 మందికి గాయాలు - షాపింగ్ మాల్‌లో కాల్పులు
US Shooting: అమెరికా కొలంబియాలోని ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పథకం ప్రకారమే కాల్పులు జరిగినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
US Shooting
అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిన చర్యగా తాము భావించడం లేదని పథకం ప్రకారమే కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆయుధాలు కలిగి ఉన్నవారు ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:'శత్రువులు చాలా క్రూరులు.. కీవ్‌కు అప్పుడే రావొద్దు'
Last Updated : Apr 17, 2022, 10:06 AM IST