మహ్మద్ ప్రవక్తపై భాజపా మాజీ నేతలు నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ చెసిన అనుచిత వ్యాఖ్యలు.. అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారాయి. భారత్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపే పలు ఇస్లామిక్ దేశాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఈ వివాదంపై తాజాగా అమెరికా స్పందించింది. మత స్వేచ్ఛతో పాటు మానవ హక్కుల ఆందోళనలపై భారత్‌తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తామని తెలిపింది.
"భాజపాకు చెందిన ఇద్దరు నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. అదే సమయంలో ఈ వ్యాఖ్యలను పార్టీ బహిరంగంగా ఖండించడాన్ని గమనించాం. మత స్వేచ్ఛతో సహా మానవహక్కుల ఆందోళనలపై భారత ప్రభుత్వంలోని సీనియర్ స్థాయి వ్యక్తులతో నిత్యం సంప్రదింపులు జరుపుతుంటాం. మానవ హక్కులపై గౌరవాన్ని పెంపొందించుకోవాలని భారత్‌ను ప్రోత్సహిస్తున్నాం"
-నెడ్‌ప్రైస్, అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి