అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కరోనా పాజిటివ్ - undefined

20:09 July 21
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా బారిన పడ్డ బైడెన్‌కు స్వల్పంగానే వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన అధ్యక్ష భవనంలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రెస్ సెక్రటరీ తెలిపారు.
ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోస్‌ను కూడా బైడెన్ తీసుకున్నారు. అయినా అయన కరోనా బారిన పడటం గమనార్హం. ఐసోలేషన్‌లోనే ఉంటూ.. బైడెన్ తన అధికారిక విధులను నిర్వర్తిస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది.