తెలంగాణ

telangana

By

Published : Feb 14, 2023, 9:34 PM IST

Updated : Feb 14, 2023, 10:51 PM IST

ETV Bharat / international

ఎయిర్​ఇండియా మరో ఆర్డర్​​.. బోయింగ్​ నుంచి 220 విమానాల కొనుగోలు

బోయింగ్ నుంచి 220 విమానాలను కొనుగోలు చేయనుంది ఎయిర్ఇండియా. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. దీనిని చారిత్రక ఒప్పందంగా అభివర్ణించారు.

air india boeing order
air india boeing order

టాటా గ్రూప్​నకు చెందిన ప్రమఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా మరో భారీ డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే ఎయిర్‌బస్‌ నుంచి 250 విమానాలు కొనుగోలు చేసిన ఎయిర్​ఇండియా.. బోయింగ్​ సంస్థకు మరో 220 విమానాలను ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 80 బిలియన్ డాలర్లతో 470 విశాలమైన, తక్కువ విశాలమైన బాడి కలిగిన విమానాలను కొనుగోలు చేయనుంది ఎయిర్ ఇండియా. తాజాగా కొనుగోలు చేసిన మొదటి విమానం 2023 వస్తుందని.. మిగిలినవి 2025 మధ్యలో అందుబాటులోకి వస్తాయని చెప్పింది.

బోయింగ్​ సంస్థ నుంచి 220 విమానాలను ఎయిర్​ఇండియా కొనుగోలు విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. దీనిని చారిత్రక ఒప్పందంగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ ఒప్పందం కృషి చేస్తోందన్నారు. ఈ ఒప్పందం ద్వారా 190 B737 MAX, 20 B787, 10 B777X విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వైట్​హౌస్​ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందంలో మరో 70 విమానాలకు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీటి విలువ 34 బిలియన డాలర్లు ఉంటుందని పేర్కొంది. ఎయిర్​ఇండియా ఇచ్చిన ఈ ఆర్డర్​ బోయింగ్ చరిత్రలోనే మూడో అతిపెద్ద ఒప్పందమని చెప్పింది.

అంతకుముందే ఎయిర్‌బస్‌ నుంచి 250 విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది ఎయిర్​ఇండియా. 17 ఏళ్ల తర్వాత ఎయిర్ఇండియా తొలిసారి విమానాల కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ సంస్థ నుంచి 250 విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో విశాలమైన బాడి కలిగిన 40 A-350 విమానాలతోపాటు 210 సన్నని బాడి కలిగిన విమానాలు ఉన్నట్లు టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. వర్చువల్‌గా జరిగిన ఎయిర్ఇండియా-ఎయిర్‌ బస్‌ ఒప్పంద కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తదితరులు పాల్గొన్నారు. విశాలమైన బాడీ కలిగిన విమానాలను అల్ట్రా లాంగ్‌హాల్‌ విమానాల కోసం ఉపయోగించనున్నట్లు టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. సాధారణంగా 16 గంటల కంటే కొంచెం ఎక్కువ వ్యవధి కలిగిన విమానాలను అల్ట్రా-లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటారు.

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా చివరిసారి 2005లో 111 విమానాల కోసం ఆర్డర్‌ చేసింది. బోయింగ్‌ నుంచి 68, ఎయిర్‌ బస్‌ నుంచి 43 విమానాలను 10.8 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసింది.

ఇవీ చదవండి:250 విమానాలు కొంటున్న ఎయిర్​ఇండియా.. ప్రపంచంలోనే అతిపెద్ద డీల్!

విదేశాలకు చదువు కోసం వెళ్తున్నారా.. అయితే స్టూడెంట్​ ట్రావెల్ ఇన్సూరెన్స్​ తీసుకోండి

Last Updated : Feb 14, 2023, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details