తెలంగాణ

telangana

ETV Bharat / international

పోలీసు కర్కశం.. నల్లజాతీయుడిని కింద పడేసి.. తలపై కాల్చి.. - అమెరికా నల్లజాతీయుడిపై పోలీసు కాల్పులు

US Police shot Black man: అమెరికాలో దారుణం జరిగింది. శ్వేతజాతీయుడైన ఓ పోలీసు అధికారి.. నల్లజాతీయుడి ప్రాణాలు తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడిని కింద పడేసి, తల వెనక భాగంలో కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు విడుదల చేశారు.

US PATRICK SHOOTING
US PATRICK SHOOTING

By

Published : Apr 14, 2022, 1:04 PM IST

Updated : Apr 14, 2022, 1:10 PM IST

US Police shot Black man: అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ తరహా ఉదంతం మరొకటి చోటు చేసుకుంది. నల్లజాతీయుడితో ఓ పోలీసు అధికారి కర్కశంగా ప్రవర్తించి, హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పాట్రిక్ లయోయా(26) అనే వ్యక్తిని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి.. కిందపడేసి, తల వెనక తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో ప్యాట్రిక్ ప్రాణాలు కోల్పోయాడు. మిషిగన్​లోని గ్రాండ్ ర్యాపిడ్స్ అనే ప్రాంతంలో ఏప్రిల్ 4న ఈ ఘటన జరిగింది.

పోలీసు ధరించిన కెమెరాకు చిక్కిన దృశ్యాలు

ఏం జరిగిందంటే?:రోడ్డుపై వెళ్తున్న ప్యాట్రిక్​ను పోలీసు అడ్డగించి వివరాలు అడిగాడు. లైసెన్స్ ప్లేట్ ఆ కారుకు సంబంధించినది కాదని పోలీసు గుర్తించాడు. పోలీసు అధికారి దగ్గరకు రాకముందే లయోయా.. తన కారు దిగాడు. దగ్గరకు వచ్చిన పోలీసు అధికారి.. వెనక్కి తిరిగి కారులో కూర్చోవాలని ఆదేశించాడు. అందుకు లయోయా తిరస్కరించాడు. ఇంగ్లిష్​లో మాట్లాడాలని కోరాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని అడిగాడు. అనంతరం లయోయా పారిపోగా.. అతడిని వెంబడించేందుకు పోలీసు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతడిని కిందపడేసి కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మిషిగన్ పోలీసు విభాగం విడుదల చేసింది.

ప్యాట్రిక్​ను వెంబడిస్తున్న పోలీసు
కింద పడేసి తలను గట్టిగా నేలకు అదిమి పడుతున్న చిత్రం...

"పారదర్శకత కోసం ఈ వీడియోలను విడుదల చేశాం. ఈ ఘటన చాలా విషాదకరం. పోలీసు అధికారి రెండు సార్లు టేజర్​ను ఉపయోగించారు. అయితే, బాధితుడికి ఇది తగలలేదు. టేజర్​పై ఇరువురి మధ్య 90 సెకన్ల పాటు గొడవ జరిగింది. ఆ తర్వాత అధికారి కాల్పులు జరిపారు."
-విన్​స్ట్రోమ్, గ్రాండ్ ర్యాపిడ్స్ పోలీసు విభాగం అధిపతి

Michigan cop shot on Black man: అయితే, కాల్పులు జరిపిన అధికారి పేరు, వివరాలను పోలీసు విభాగం వెల్లడించలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహానికి పరీక్షలు పూర్తి చేశారు. నివేదికలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతుడు లయోయాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని మిషిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి కుటుంబ సభ్యులతో కలిసి అతడు శరణార్థిగా అమెరికాకు వచ్చాడని తెలిపారు.

ఘటనాస్థలిలో పుష్పాలు ఉంచి స్థానికుల నివాళులు
ప్లకార్డులతో నిరసన

మరోవైపు, ఈ ఘటనపై పౌర హక్కుల ఉద్యమకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాల్పులకు తెగబడిన అధికారిని సస్పెండ్ చేయాలని ప్రముఖ అటార్నీ బెన్ క్రంప్ డిమాండ్ చేశారు. నిరాయుధుడైన వ్యక్తితో పోలీసు అధికారి ఈ విధంగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. ఈ వీడియోలు విడుదల చేసిన తర్వాత వందలాది మంది స్థానికులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అధికారి పేరును చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యమే అంటూ నినాదాలు చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

ప్యాట్రిక్​కు న్యాయం చేయాలని డిమాండ్లు

ఇదీ చదవండి:'మాట్లాడుకోవడాల్లేవ్.. రాజపక్స రాజీనామా చేయాల్సిందే'

Last Updated : Apr 14, 2022, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details