తెలంగాణ

telangana

ETV Bharat / international

విద్యుత్ టవర్​ను ఢీకొట్టిన విమానం.. వైర్లలో ఇరుక్కున్న పైలట్లు.. నగరంలో కరెంట్ కట్! - ప్లేన్ క్రాష్ అమెరికా

అమెరికాలో ఓ విమానం అదుపుతప్పి విద్యుత్ టవర్​ను ఢీకొట్టింది. విమానంలోని ఇద్దరు వ్యక్తులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని కిందకు దించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

us-plane-crashes-into-power-lines
us-plane-crashes-into-power-lines

By

Published : Nov 28, 2022, 12:17 PM IST

Updated : Nov 28, 2022, 7:49 PM IST

అమెరికాలోని మేరీలాండ్​లో ఓ విమానం విద్యుత్ టవర్​ను ఢీకొట్టింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. టవర్​ను ఢీకొట్టగానే విమానం విద్యుత్ వైర్ల మధ్య ఇరుక్కుపోయింది. న్యూయార్క్ నుంచి ఈ సింగిల్ ఇంజిన్ విమానం బయల్దేరిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) వెల్లడించింది. గైతెర్స్​బర్​లోని మాంట్​గోమేరీ కౌంటీ ఎయిర్​పార్క్​ వద్ద సాయంత్రం 5.40 గంటలకు విమానం ప్రమాదానికి గురైంది. వంద అడుగుల ఎత్తులోనే విమానం చిక్కుకుపోయింది.

విమానంలో పైలట్ పాట్రిక్ మెర్కెల్(65), జాన్ విలియమ్స్(66) అనే ప్రయాణికుడు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిద్దరికి తీవ్రగాయాలయ్యానని చెప్పారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. "ముందుగా హైటెన్షన్ విద్యుత్ వైర్లను తొలగిస్తాం. అప్పుడు సహాయక చర్యలకు ఆటంకం లేకుండా ఉంటుంది. ప్లేన్​ను కదలనీయకుండా చేసి.. బకెట్ ట్రక్కుల ద్వారా అందులోని ఇద్దరిని కిందకు దించేందుకు ప్రయత్నిస్తాం. విమానంలో ఉన్నవారితో సెల్​ఫోన్ ద్వారా సంభాషణ జరుపుతున్నాం" అని మాంట్​గోమేరీ కౌంటీ అగ్నిమాపక దళ అధికారి స్కాట్ గోల్డ్​స్టెయిన్ పేర్కొన్నారు.

విద్యుత్ టవర్​లో చిక్కుకున్న విమానం

లక్ష మందికి కరెంట్ కట్!
ఘటన కారణంగా మాంట్​గోమేరీ కౌంటీలో లక్షా 20 వేల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికంగా అనేక ట్రాఫిక్ లైట్లు ఆగిపోయాయని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు పూర్తైన తర్వాతే.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.

విద్యుత్ టవర్​లో చిక్కుకున్న విమానం
Last Updated : Nov 28, 2022, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details