తెలంగాణ

telangana

ETV Bharat / international

పాఠశాలలో మారణహోమం.. కాల్పుల్లో 21 మంది మృతి

Texas school shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉవాల్డేలోని స్థానిక పాఠశాలలో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో కాల్పులకు తెగబడిన నిందితుడు చనిపోయాడని ఉవాల్డే గవర్నర్ గ్రెెగ్ అబాట్ తెలిపారు.

us school shooting
Texas school shooting

By

Published : May 25, 2022, 4:46 AM IST

Updated : May 25, 2022, 7:50 AM IST

Texas school shooting: అమెరికాలోని ఉవాల్డేలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో.. 18 మంది పిల్లలు సహా మరో ముగ్గురు మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో.. రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ కాల్పులు జరిగినట్లు టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్ అబాట్‌ తెలిపారు. టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో.. ఇదే అత్యంత దారుణమైన కాల్పుల ఘటన అని ఆయన చెప్పారు. కాల్పులకు పాల్పడిన నిందితుడు స్థానికుడైన సాల్వడోర్ రామోస్​గా పోలీసులు గుర్తించారు.

నిందితుడు రామోస్​.. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు. ఈ క్రమంలో ఇద్దరు అధికారులకు తూటా గాయాలు అయినట్లు పోలీసు అధికారి పీట్ అర్రెడోండో పేర్కొన్నారు. ఉవాల్డే కాల్పుల ఘటన నేపథ్యంలో.. రాబ్‌ స్కూల్‌ను భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. ఎఫ్​బీఐ అధికారులు సైతం.. రంగంలోకి దిగారు. కాల్పులకు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన చిన్నారులు 5 నుంచి 11 ఏళ్ల మధ్య వారని తెలిపారు. అయితే ఈ చిన్నారులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నాయనమ్మను చంపి..: నిందితుడు ఈ కాల్పులకు పాల్పడేందుకు ముందే పథకం వేశాడని.. తన 18వ పుట్టినరోజు నాడు ఇందుకోసం రెండు రైఫిళ్లను కొనుగోలు చేశాడని అధికారులు వెల్లడించారు. స్కూల్లో కాల్పులు జరిపేందుకు ముందు అతని నాయనమ్మను కూడా కాల్చి చంపాడని తెలిపారు. అతను ఈ దారుణాలకు పాల్పడడానికి వెనుక కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

ఆసియా పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. 'ఆయుధాల వినియోగంపై ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది.. ఇలాంటి మారణహోమాలు జరిగేందుకు మనం ఎందుకు అవకాశం ఇస్తున్నాం?' అని ప్రశ్నించారు. అమెరికాలోని అన్ని ప్రభుత్వ భవనాలు, మిలటరీ స్థావరాలు, నావల్​ స్టేషన్స్​, అమెరికా రాయబార కార్యాలయాల వద్ద జాతీయ జెండాను మే28 సాయంత్రం వరకు అవనతం చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:సూపర్​ మార్కెట్​లో దుండగుడి కాల్పులు.. 10 మంది మృతి

Last Updated : May 25, 2022, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details