తెలంగాణ

telangana

ETV Bharat / international

'నేను నిర్దోషిని.. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలా'.. కోర్టులో ట్రంప్ వాంగ్మూలం - కోర్టుకు హాజరైన డొనాల్డ్ ట్రంప్

Donald Trump Indictment : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని నేరాభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను నిర్దోషినని పేర్కొన్నారు. వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టులో ట్రంప్‌.. గురువారం హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

Donald Trump Indictment
Donald Trump Indictment

By

Published : Aug 4, 2023, 7:04 AM IST

Updated : Aug 4, 2023, 8:42 AM IST

Donald Trump Indictment : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ మళ్లీ పాత రాగమే అందుకున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని తారుమారు చేసేందుకు కుట్ర చేశారన్న కేసులో తాను నిర్దోషినే అని వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు. జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేక న్యాయవాది జాక్‌ స్మిత్ నేరారోపణలు మోపిన 2 రోజుల తర్వాత.. ట్రంప్‌ గురువారం మెజిస్ట్రేట్‌ ముందు హాజరయ్యారు. మెజిస్ట్రేట్‌ ప్రశ్నించినప్పుడు ట్రంప్‌ లేచి నిల్చుని సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో ఆయనపై అభియోగాలు మోపిన జాక్‌ స్మిత్‌ కూడా కోర్టు హాల్‌లోనే ఉన్నారు.

Donald Trump Appeared In Court : విచారణ అనంతరం మీడియాతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముచ్చటించారు. అమెరికాకు ఇది విచారకరమైన రోజనీ.. దేశంలో ఇలా జరుగుతుందని తానెప్పుడు అనుకోలేదని వివరించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రన్న ట్రంప్‌.. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా చేస్తున్నారని తెలిపారు. తనపై మోపిన అభియోగాలను ఎదుర్కొనబోతున్నట్లు చెప్పారు. కాగా.. డొనాల్డ్​ ట్రంప్​పై నమోదైన కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఆగస్టు 28న జరగనుంది. ఈ కేసులో ట్రంప్​ దోషిగా తేలితే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతకుముందు.. ట్రంప్‌ వాషింగ్టన్‌ డీసీకి ప్రత్యేక విమానంలో వచ్చారు. తర్వాత భారీ కాన్వాయ్‌లో వాషింగ్టన్‌ డీసీ నగరం గుండా ప్రయాణించి కోర్టు వద్దకు చేరుకున్నారు.

ఇదీ కేసు..
2021 జనవరి 26న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్‌ క్యాపిటల్‌ భవనంలో కాంగ్రెస్‌ సమావేశమైంది. అయితే ఈ సమావేశం జరగడానికి కొద్దిగంటల ముందు ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. దీంతో ట్రంప్‌ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో డొనాల్డ్ ట్రంప్​పై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులో గురువారం వాషింగ్టన్​ ఫెడరల్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున రేసులో ఉన్న ట్రంప్‌పై ఇప్పటికే రెండు నేరాభియోగాలు ఉన్నాయి. గత నాలుగు నెలల్లో ట్రంప్‌ కోర్టుకు హాజరుకావడం ఇది మూడోసారి. రహస్య దస్త్రాలను తన ఇంట్లో దాచిన కేసులో ఒకసారి, పోర్న్‌ స్టార్‌కు డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్‌ కోర్టుకు హాజరయ్యారు.

Last Updated : Aug 4, 2023, 8:42 AM IST

ABOUT THE AUTHOR

...view details