తెలంగాణ

telangana

ETV Bharat / international

జవహరీని మట్టుబెట్టడంలో అమెరికాకు పాక్​ సాయం! - పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌

AL ZAWAHIRI NEWS: అల్​ఖైదా అధినేత అల్‌ జవహరీని అమెరికా ఆదివారం ఉదయం మట్టుబెట్టింది. అయితే అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో పాకిస్థాన్ పాత్ర చర్చనీయాంశమైంది. అమెరికా అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​కు డ్రోన్ పంపించేందుకు పాక్ గగనతలాన్ని వినియోగించి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.

al zawahiri death
అల్​ఖైదా అధినేత అల్‌ జవహరీ

By

Published : Aug 5, 2022, 7:17 AM IST

AL ZAWAHIRI NEWS: అల్‌ఖైదా ఉగ్రవాద ముఠా అధిపతి అల్‌ జవహరీని మట్టుబెట్టేందుకు అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో పాక్‌ పాత్ర ఇప్పుడు చర్చనీయాంశమైంది. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో ఆదివారం ఉదయం జవహరీ హతమైయ్యాడు. అయితే అక్కడికి అమెరికా డ్రోన్‌ను పంపించడానికి పాకిస్థాన్‌ గగనతలాన్ని వినియోగించి ఉండొచ్చన్న బలమైన ప్రచారం సాగుతోంది.

"గల్ఫ్‌ ప్రాంతం నుంచి కాబుల్‌ దిశగా డ్రోన్‌ దూసుకొచ్చింది. ఇరాన్‌ ఎలాగూ తన గగనతలాన్ని అమెరికాకు అనుమతించదు. అలాంటప్పుడు పాక్‌ సాయం చేసిందా?" అంటూ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) నాయకుడు షిరీన్‌ మజారీ అనుమానం వ్యక్తం చేశారు. దాడికి ఉపయోగించిన డ్రోన్‌ ఎక్కడి నుంచి బయల్దేరింది? ఏ దిశలో పయనించిందన్న విషయాన్ని అమెరికా వెల్లడించలేదు. అయితే కిర్గిజిస్థాన్‌లోని ఒకప్పటి అమెరికా సైనిక శిబిరానికి గానిక్‌ వైమానిక స్థావరాన్ని వాడుకున్నట్లు వార్తలొచ్చాయి. జవహరీని మట్టుబెట్టే చర్యలో పాకిస్థాన్‌ గగనతలాన్ని మాత్రమే ఇచ్చిందా, నిఘా సమాచారం కూడా చేరవేసిందా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details