Porn classes: అమెరికాలోని ఓ కళాశాల పోర్న్ తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రానున్న వేసవిలో తమ కాలేజీలో పోర్న్‌పై ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నట్లు ఉతాలోని సాల్ట్‌లేక్‌లో గల వెస్ట్‌మిన్‌స్టెర్ కళాశాల యాజమాన్యం తమ అధికార వెబ్‌సైట్‌లో ప్రకటించింది. 'FILM-300o: porn' పేరుతో సమ్మర్ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. విద్యార్థులు కాలేజీ తరగతి గదిలో కూర్చొని పోర్న్ వీడియోలు చూస్తారు. పోర్న్‌ను 'ప్రయోగాత్మక, రాడికల్ ఆర్ట్ ఫారమ్గా' అన్వేషించే ప్రయత్నం చేస్తారంటూ వెబ్‌సైట్లో పేర్కొన్నారు.
అయితే ఈ ప్రకటన వివాదాస్పదమైంది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తరగతులను కాలేజీలో కాకుండా బయట నిర్వహిస్తామని చీఫ్ మార్కెటింగ్ అధికారి షైలా రాప్పాజో యార్కిన్ వెల్లడించారు. వెబ్‌సైట్లోనూ ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే ఆ ప్రాంతాన్ని తెలియజేస్తామని పేర్కొన్నారు.