తెలంగాణ

telangana

ETV Bharat / international

ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి - అపార్ట్​మెంట్​లో కూలిన అపార్ట్​మెంట్

రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆరుగురు బాలికలు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.

us car accident
us car accident

By

Published : Mar 27, 2023, 7:14 AM IST

Updated : Mar 27, 2023, 7:54 AM IST

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఏడాది చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన టెన్నెస్సీ రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్‌ఫీల్డ్ సమీపంలో ఆదివారం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 1-18 ఏళ్ల వయసు గల ఆరుగురు బాలికల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రమాద సమయంలో కారులోంచి కింద పడి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన మరో వాహనాన్ని అధికారులు పరిశీలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రమాదం జరిగిన హైవేను అధికారులు కొన్ని గంటల పాటు మూసివేశారు. అనంతరం ఆదివారం సాయంత్రం తిరిగి రాకపోకలను పునరుద్ధరించారు.

కూలిన అపార్ట్​మెంట్​ ఫ్లోర్​..
అమెరికాలో ప్రమాదం జరిగింది. అపార్ట్​మెంట్​​లోని రెండో అంతస్తు కుప్పకూలిన ఘటనలో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులతో సహా, ఫైర్​ సిబ్బంది, అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఏడుగురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురికి ఘటనాస్థలిలోనే చికిత్స అందించారు. ఈ ఘటన ఇండియానా పెన్సిల్వేనియా యూనివర్సిటీ సమీపంలో జరిగిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో అపార్ట్​మెంట్​లో ఎంత మంది ఉన్నారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదని వెల్లడించారు. గాయపడిన వారిలో ఎంత మంది యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారో తెలియలేదని పేర్కొన్నారు.

టోర్నడోల బీభత్సం..
ఇటీవల అమెరికాలోని మిసిసిపి, అలబామా రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. సుడిగాలులు, వడగళ్ల వానకు 26 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. టోర్నడోల ధాటికి కళ్ల ముందే ఇళ్లు మాయం కావడం వల్ల వందలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా మిసిసిపి రాష్ట్రంలోని రోలింగ్​ ఫోక్స్​ పట్టణం టోర్నడోల ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. నేల కూలిన భవనాలతో శిథిలాల కుప్పలుగా మారింది. కాగా టోర్నడోల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ హామీ ఇచ్చారు.

టోర్నడోల ధాటికి ముఖ్యంగా మిసిసిపీలో షార్కీ కౌంటీలోని సిల్వర్ సిటీ, రోలింగ్ ఫోర్క్‌, జాక్సన్‌లతోపాటు వినోనా, హంఫ్రీస్, కరోల్ కౌంటీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అలబామా, మిసిసిపీ, టెనసీవ్యాప్తంగా 83 వేలకుపైగా ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు పవర్‌ఔటేజ్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. విపత్తు బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.​

Last Updated : Mar 27, 2023, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details