తెలంగాణ

telangana

ETV Bharat / international

2007లో ఫోన్ కొని మర్చిపోయింది.. ఇప్పుడు వేలం వేస్తే రూ.52లక్షలు!

ఒక ఐఫోన్​కు రూ.52లక్షలు. వామ్మో అంత ధరనా? అయినా అంత ధర పెట్టడానికి దానిలో అంత ప్రత్యేకత ఏముంది అని అందరికీ సందేహం కలుగవచ్చు. మరి నిజంగానే దానికో ప్రత్యేకత ఉందండి. 2007లో విడుదలైన ఫస్ట్ జనరేషన్ ఐఫోన్​ ఇప్పటికీ సీల్​ తీయకుండా, చెక్కుచెదరకుండా, చక్కని ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. అందుకే దానికి అంత ప్రత్యేకత. మరి ఆ ఫోన్ పూర్తి వివరాలు మీకోసం.

us auction nets 52lakhs for iphone first generation unopened iphone from 2007
ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ ధర రూ.52లక్షలు

By

Published : Mar 1, 2023, 11:09 AM IST

Updated : Mar 1, 2023, 1:26 PM IST

అమెరికాలో 2007లో కొన్న ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ మోడల్ ప్రస్తుతం రూ.52లక్షలకు (63వేల డాలర్లు) అమ్ముడుపోయింది. ఎల్​సీజీ హౌస్​ వేసిన వేలం పాటలో ఈ పాత ఫోన్​ను కొనేందుకు ఎగబడ్డారు. ఇన్వెస్టర్లు, పాత ఫోన్లు సేకరించే వారు పెద్ద ఎత్తున ఈ వేలంలో పాల్గొన్నారు. 50వేల డాలర్లు వస్తాయని ముందుగా అంచనా వేయగా.. ఈ ఫోన్ ఏకంగా 63 వేల డాలర్లకు పైగా రాబట్టింది.

ఫోన్ ఎవరిదంటే?
16 సంవత్సరాల క్రితం టాటూ ఆర్టిస్ట్ కరెన్ గ్రీన్​కు తన స్నేహితులు ఈ ఐఫోన్​ను గిప్ట్​గా ఇచ్చారు. 2007లో కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు కరెన్ స్నేహితులు ఆమెకు కానుకగా.. ఫస్ట్ జనరేషన్ ఐఫోన్​ను ఇచ్చారు. దానిని ఆమె ఆమె ఉపయోగించకుండా.. సీల్ తీయకుండా దాచి పెట్టి ఉంచింది. ఆమె అప్పటికే సాధారణ ఫోన్​ను వాడుతోంది. స్మార్ట్​ఫోన్​కు మారాలంటే.. ఏటీ అండ్ టీ నెట్​వర్క్​కు మారాలి. అది ఇష్టం లేక కరెన్.. స్మార్ట్​ఫోన్​ను ఉపయోగించకుండా ఉండిపోయింది. కనీసం ఫోన్ బాక్స్ సీల్ కూడా తీయకుండా జాగ్రత్తగా దాచిపెట్టింది. తర్వాత దాని సంగతే మర్చిపోయింది.

అయితే, సీల్ తీయని ఫోన్లకు ఎక్కువ విలువ ఉంటుందని కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంది కరెన్. 2019లో 'ద డాక్టర్ అండ్ ద దీవా' షోలో ఆ ఫోన్ విలువ 5వేల డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. దీంతో కరెన్.. వేలం నిర్వాహకులను సంప్రదించింది. ఈమె 'ఎల్​సీజీ ఆక్షన్స్' అనే వెబ్​సైట్​లో ఫిబ్రవరి2న ఫోన్​ను వేలానికి పెట్టింది. 50వేల డాలర్లు వస్తాయని అని తొలుత కంపెనీ అంచనా వేసింది. అయితే, దానికి ఊహించిన దానికంటే అధిక స్పందన వచ్చింది.

'ఐఫోన్ కొత్త ఫీచర్లతో చాలా బాగుంది. కనీసం ఫోన్ డబ్బా అంచులు కూడా పాడవకుండా చాలా షార్ప్​గా ఉన్నాయి. మంచి కలర్​తో చెక్కు చెదరకుండా ఉంది. పాత ఫోన్లను కలెక్ట్ చేసుకోవాలి అనుకునేవారికి ఇది ఒక గొప్ప ఫోన్' అని చెబుతూ కరెన్ గ్రీన్.. తన ఫోన్​ను వేలానికి పెట్టింది. వేలంలో ప్రారంభ ధర 2,500 డాలర్లుగా నిర్ణయించారు. వేలం పాటలో 27 బిడ్ల తర్వాత ఈ ఐఫోన్​కు అనూహ్యంగా 63,356.40 డాలర్లు (దాదాపు రూ.52,47,303) వచ్చాయి. 599డాలర్లకు కొన్న ఫోన్ ప్రస్తుతం 63వేల డాలర్లకు వేలంలో అమ్ముడు పోయిన నేపథ్యంలో అందరూ షాక్​కు గురయ్యారు. తొలి తరం ఐఫోన్​గా వచ్చిన ఈ స్మార్ట్​ఫోన్​.. 2జీ నెట్​వర్క్​తో పనిచేస్తుంది. 4జీబి, 8జీబి,16జీబి స్టోరేజ్​తో మార్కెట్​లోకి వచ్చింది.

Last Updated : Mar 1, 2023, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details