తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్‌కు హైఅలర్ట్‌.. చినూక్‌ హెలికాప్టర్లను పక్కనపెట్టిన అమెరికా!

Chinook Chopper : ఇంజిన్లలో మంటలు చెలరేగుతుండడం వల్ల సైనిక దళాల రవాణాలో కీలక పాత్ర పోషించే 400 చినూక్​ హెలికాప్టర్లను అమెరికా సైన్యం​ పక్కనపట్టింది. అయితే ఆ రకం హెలికాప్టర్లు.. భారత సైన్యం కూడా ఉపయోగిస్తోంది.

By

Published : Aug 31, 2022, 1:37 PM IST

Chinook Chopper
Chinook Chopper us army

Chinook Chopper : సైనిక దళాల రవాణాలో కీలక పాత్ర పోషించే 400 చినూక్‌ హెలికాప్టర్లను అమెరికా సైన్యంలోని మెటీరియల్‌ కమాండ్‌ తాత్కాలికంగా పక్కనపెట్టింది. వీటి ఇంజిన్లలో మంటలు చెలరేగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకొంది. ఈ హెలికాప్టర్లను బోయింగ్‌ సంస్థ తయారు చేస్తోంది. 1960 నుంచి దళాల రవాణా, విపత్తు సహాయక చర్యలు, క్షతగాత్రుల తరలింపు వంటి కార్యక్రమాల్లో చినూక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రకం హెలికాప్టర్లను ఇటలీ, దక్షిణ కొరియా, కెనడా, భారత్‌ తదితర దేశాలు వినియోగిస్తున్నాయి. భారత వాయుసేనలో ప్రస్తుతం 15 చినూక్‌లు సేవలు అందిస్తున్నాయి.

"హెచ్‌-47(చినూక్‌) హెలికాప్టర్ల ఇంధన ట్యాంకులు లీకై మంటలు చెలరేగడానికి గల కారణాలను సైన్యం గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాం" అని అమెరికా సైన్యం అధికార ప్రతినిధి సింతియా.ఓ .స్మిత్‌ పేర్కొన్నారు. కాకపోతే ఈ ప్రమాదాల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ హెలికాప్టర్లను పక్కనపెట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తామని అమెరికా సైన్యం వెల్లడించింది.

హనీవెల్‌ సంస్థ నిర్మించిన కొన్ని రకాల ఇంజిన్లు అమర్చిన హెలికాప్టర్లలో ఈ సమస్య ఉన్నట్ల చెబుతున్నారు. దీనిపై వ్యాఖ్యానించడానికి బోయింగ్‌ సంస్థ నిరాకరించింది. మరో వైపు హనీవెల్‌ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. అమెరికా సైన్యంతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 'ఓ-రింగ్స్‌'గా పిలిచే భాగాలు సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడించారు.

ఇవీ చదవండి:సోవియట్‌ యూనియన్‌ చివరి నాయకుడు మిఖాయిల్‌ గోర్బచేవ్‌ కన్నుమూత

అమెజాన్​ అడవుల్లోని ఆ ఒక్కడు ఇకలేడు.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details