Ukraine Russia War: తూర్పు ప్రాంతంలో ఉక్రెయిన్ పట్టు సాధిస్తోంది. ఒక హబ్‌లో రష్యా సహజ వాయువును అడ్డుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యా సహజ వాయువు సరఫరాపై ప్రభావం పడింది. ఉక్రెయిన్‌కు చెందిన సహజ వాయువు పైప్‌లైన్ ఆపరేటర్ తూర్పు ప్రాంతంలోని కీలక కేంద్రం ద్వారా రష్యా సహజ వాయువును నిలిపివేశారు. మాస్కో మద్దతు కలిగిన వేర్పాటువాదులు నియంత్రించే ప్రాంతమైన నోవోప్‌స్కోవ్ హబ్ ద్వారా రష్యా సహజ వాయువును అడ్డుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ మీదుగా పశ్చిమ ఐరోపాకు వెళ్తున్న రష్యా గ్యాస్‌లో మూడోవంతు ఈ హబ్ ద్వారానే సరఫరా అవుతోంది.
తాము ఆ ప్రాంతం ద్వారా సరఫరా చేస్తున్న గ్యాస్ కేవలం పావువంతు అని రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని సహజ వాయువు దిగ్గజం గాజ్‌ప్రోమ్ పేర్కొంది. ఆక్రమిత శక్తుల జోక్యం కారణంగా రష్యా సహజవాయువు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఉక్రెయిన్ ఆపరేటర్ చెప్పారు. ఉక్రెయిన్ నియంత్రణలోని ఉత్తర ప్రాంతం ప్రధాన కేంద్రమైన సుడ్జా ద్వారా రష్యా తన సహజవాయువు సరఫరాను మార్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇది సాంకేతికంగా అసాధ్యమని గాజ్ ప్రోమ్ ప్రతినిధి తెలిపారు. గ్యాస్ సరఫరా నిలిపివేయటానికి కారణాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.