Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ల మధ్య భీకరమైన దాడి కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలోనే తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోని డాన్‌బాస్‌పై రష్యా తన బలగాలను మోహరిస్తోందని బ్రిటన్ రక్షణమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ఇంటిలిజెన్స్.. సోషల్ మీడియాలో తెలిపింది. వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ గ్రూప్‌కు చెందిన కిరాయి సైనికులతో కలిసి రష్యా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది.
Ukraine Crisis: కిరాయి సైనికులతో డాన్‌బాస్‌పై రష్యా గురి! - ఉక్రెయిన్ న్యూస్
Ukraine Crisis: తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోని డాన్‌బాస్‌పై రష్యా తన బలగాలను మోహరిస్తోందని బ్రిటన్ రక్షణమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ఇంటిలిజెన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
డాన్‌బాస్‌పై గురిపెట్టిన రష్యా
రష్యా ఇప్పటికే దక్షిణ ఓడరేవు నగరమైన మరియుపోల్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. "గత కొన్ని వారాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకరయుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఉక్రెయిన్ దళాలు మాత్రం గట్టిగా ప్రతిఘటిస్తూ.. తమ ప్రాంతాలను నియంత్రణలో ఉంచుకుంటున్నాయి" అని తెలిపింది. మరియుపోల్ అనేది రష్యాకు కీలక లక్ష్యం. ఇది రష్యా నుంచి దాని ఆక్రమిత క్రిమియా భూభాగానికి మధ్య కారిడార్‌గా పనిచేస్తుంది.
ఇదీ చదవండి:రష్యా 'మారణహోమం'.. శవాల గుట్టగా మారిన 'బుచా'