Ukraine Crisis: ఉక్రెయిన్‌పై తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై.. యుద్ధ నేరాల విచారణ జరపాలన్నారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్. ఈ దురాగతాలు చూసిన తరువాత మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు హెచ్చరించారు. బుచా ఘటనపై స్పందించిన బైడెన్.. "బుచాలో ఏమి జరిగిందో మీరు చూశారు. పుతిన్ ఓ యుద్ధ నేరస్థుడు" అని అన్నారు. పుతిన్ యుద్ధ నేరుస్థుడని అన్నందుకు గతంలో తనపై విమర్శలు చేశారని, కానీ ఈ దారుణాలు చూస్తే అతను నిజంగా యుద్ధ నేరస్థుడే అని అర్థమవుతోందని చెప్పారు.
'పుతిన్ యుద్ధ నేరాలపై విచారణ.. రష్యాపై మరిన్ని ఆంక్షలు' - వ్లాదిమిర్ పుతిన్ న్యూస్
Ukraine Crisis: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను యుద్ధ నేరస్థుడని మరోసారి ఉద్ఘాటించారు. ఆయన నేరాలపై విచారణ చేపట్టాలని అన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. కీవ్ సమీపంలోని పట్టణాలలో ఒకటైన బుచాను సందర్శించారు. రష్యా మారణహోమాన్ని సృష్టిస్తుందని.. వెంటనే కఠిన ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలకు పిలుపునిచ్చారు. రాజధాని కీవ్ శివారు ప్రాంతాలను ఇటీవలే రష్యా సేనల నుంచి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ బలగాలు.. కీవ్ పరిసర ప్రాంతాల్లో 410 పౌరుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపాయి. కీవ్ సమీప ప్రాంతం బుచాలో 21 మృతదేహాలను చూసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పాత్రికేయులు తెలిపారు. ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు పరిశోధకులను పంపుతామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు వాండర్ లియెన్ తెలిపారు.
ఇదీ చదవండి:410 మందిని చేతులు కట్టేసి.. తలపై కాల్చి.. రష్యా హత్యాకాండకు సాక్ష్యాలివి..