Boris Johnson Pays PartyGate Fine: 2020 సంవత్సరంలో కఠినమైన కొవిడ్ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి విందుల్లో పాల్గొన్నందుకుగాను తమపై స్కాట్లాండ్ యార్డ్ విధించిన జరిమానాను చెల్లించినట్లు మీడియాకు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు చెప్పారు. అంతకుముందు బోరిస్ భార్య క్యారీ జాన్సన్ కూడా జరిమానా చెల్లించినట్లు తెలియజేశారు.
2020-21 కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలను ఇష్టానుసారం ఉల్లంఘించారంటూ 'పార్టీ గేట్' కుంభకోణం పేరిట ఒక్కొక్క విషయాలు బయటపడ్డాయి. కొవిడ్ ఆంక్షలు కఠినంగా అమలులో ఉన్న 2020 మే 20న గార్డెన్ పార్టీ, జూన్ 19న బోరిస్ జన్మదిన వేడుకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారాలపై నిజానిజాలు తేల్చేందుకు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో బోరిస్‌తో పాటు ఆ పార్టీలో పాల్గొన్న ఆర్థిక మంత్రి సునక్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని విపరీతంగా డిమాండ్లు వచ్చాయి.