తెలంగాణ

telangana

ETV Bharat / international

అసాంజే అప్పగింతకు బ్రిటన్​ ప్రభుత్వం ఆమోదం - జూలియన్​ అసాంజే అమెరికా

Julian assange extradition: వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జూలియన్​ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై అప్పీలు చేసేందుకు అసాంజేకు 14 రోజుల గడువు ఇస్తున్నట్లు యూకే హోంశాఖ ప్రతినిధి పేర్కొన్నారు.

julian assange
julian assange

By

Published : Jun 18, 2022, 6:38 AM IST

Julian assange extradition: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను రప్పించేందుకు ఏళ్లుగా అమెరికా చేస్తోన్న కృషి ఫలించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. అసాంజేను యూఎస్‌కు అప్పగించే అన్ని రకాల ప్రక్రియలకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు యూకే హోంశాఖ వెల్లడించింది. అయితే తుది ప్రయత్నంగా దీనిపై అప్పీలు చేసేందుకు అసాంజేకు 14 రోజుల గడువు మంజూరు చేసింది. 'మెజిస్ట్రేట్‌, హైకోర్టుల పరిశీలన అనంతరం జులియన్‌ అసాంజేను యూఎస్‌కు అప్పగించేందుకు నిర్ణయించాం. దీనిపై అప్పీలు చేసేందుకు అసాంజేకు 14 రోజుల గడువు ఇస్తున్నాం' అని యూకే హోంశాఖ ప్రతినిధి పేర్కొన్నారు.

పదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్‌ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని.. వికీలీక్స్‌ సంస్థపై కంప్యూటర్‌ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదిస్తోంది. వాటిలో ఆయనకు గరిష్ఠంగా 175 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ గూఢచర్యం కేసుకు సంబంధించి.. అతడిని తమ దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా ఇదివరకు చేసుకున్న అప్పీల్‌ తిరస్కరణకు గురైంది. అత్యంత గరిష్ఠ భద్రత కలిగిన యూఎస్‌ జైల్లో ఉంచడం వల్ల ఆత్మహత్యకు పాల్పడే ముప్పు ఉందని వాదించి, కోర్టు నుంచి అసాంజే ఉపశమనం పొందారు. కానీ అమెరికా తన ప్రయత్నాలు కొనసాగించి విజయం సాధించింది.

ఇదీ చూడండి :'కిమ్'​ రాజ్యం ఉక్కిరిబిక్కిరి.. కరోనాకు తోడు అంటువ్యాధులతో..!

ABOUT THE AUTHOR

...view details