తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ రాజీనామా.. కారణం ఇదే - బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్

బ్రిటన్ రాజకీయ అనిశ్చితి మధ్య ఆ దేశ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి 43 రోజులే కాగా.. అంతలోనే పదవిని వీడాల్సి వచ్చింది. అసలు ఆమె రాజీనామాకు కారణమేంటంటే?

UK Home Secretary Suella Braverman resigns
UK Home Secretary Suella Braverman resigns

By

Published : Oct 20, 2022, 6:38 AM IST

Updated : Oct 20, 2022, 11:09 AM IST

బ్రిటన్‌ రాజకీయాల్లో తాజాగా మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ (42) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. శాఖాపరమైన కమ్యూనికేషన్‌ కోసం ఆమె పొరపాటున తన వ్యక్తిగత ఈ-మెయిల్‌ను ఉపయోగించుకోవడమే అందుకు కారణం. బ్రేవర్మన్‌ భారత సంతతి నాయకురాలు. ఆమె హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టి 43 రోజులే అయింది. కేబినెట్‌ నుంచి ఆమె నిష్క్రమణ ప్రధాని లిజ్‌ ట్రస్‌ నేతృత్వంలోని సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ. మినీ బడ్జెట్‌లో చేసిన పన్ను కోత ప్రతిపాదనలపై తీవ్ర దుమారం చెలరేగడంతో.. గత శుక్రవారమే క్వాసీ క్వార్టెంగ్‌ను ఆర్థిక మంత్రి పదవి నుంచి ట్రస్‌ తప్పించారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ కొన్నిరోజులుగా స్వపక్ష నేతల నుంచీ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

బుధవారం ట్రస్‌తో భేటీ అయిన తర్వాత బ్రేవర్మన్‌ తన రాజీనామా ప్రకటన చేశారు. "నేను పొరపాటు చేశాను. అందుకు బాధ్యత వహిస్తున్నాను. పదవికి రాజీనామా చేస్తున్నాను" అని పేర్కొన్నారు. "వలస విధానాలపై రూపొందించిన ఓ ముసాయిదాను విశ్వసనీయ పార్లమెంటరీ సహచరుడికి నా వ్యక్తిగత ఈ-మెయిల్‌ నుంచి పంపించాను. పొరపాటు జరిగింది కాబట్టి నేను రాజీనామా చేయడమే సబబు. నా పొరపాటును గుర్తించిన వెంటనే అధికారిక వర్గాలకు సమాచారం అందించాను" అని బ్రేవర్మన్‌ చెప్పుకొచ్చారు.

మరో షాక్...
మరోవైపు, పార్టీ చీఫ్​ విప్ వెండీ మోర్టాన్ సైతం రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె డిప్యూటీ క్రెయిగ్ వైటకర్ సైతం పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆరు వారాల క్రితమే వెండీ మోర్టాన్​ను పార్టీ చీఫ్​ విప్​గా నియమించారు లిజ్ ట్రస్. అంతలోనే ఆమె రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

Last Updated : Oct 20, 2022, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details