Hindu sisters rape: హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన పాకిస్థాన్, పంజాబ్ రాష్ట్రంలోని బహవల్నగర్లో జరిగింది. బాధితురాళ్ల వయసు వరుసగా 16, 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జూన్ 5వ తేదీన జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిదంటే:బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అక్కాచెల్లెళ్లను తుపాకీతో బెదిరించి ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు ఉమైర్ అష్ఫాక్, కాషిఫ్ అలీగా గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ఇద్దరు బాలికలకు వైద్య పరీక్షలు చేయించగా.. అత్యాచారం జరిగినట్లు నిర్ధరణ అయిందని చెప్పారు.