తెలంగాణ

telangana

ETV Bharat / international

Tunisia Migrants Drown: పడవ బోల్తా.. 25 మంది మృతి.. 15 మంది గల్లంతు - ట్యునీషియా మునిగిన వలసదారుల పడవ

Tunisia Migrants Drown : వలసదారులతో వెళుతున్న ఓ పడవ బోల్తా పడింది. ట్యునీషియాలో జరిగిన ఈ ఘటనలో 25 మంది మృతి చెందారు. మరో 15 మంది గల్లంతయ్యారు. మృతులంతా ఆఫ్రికాలోని సబ్​-సహారాకు చెందినవారు.

tunisia migrants drown
పడవ బోల్తాపడి పలువురు మృతి

By

Published : Apr 14, 2023, 6:36 AM IST

Updated : Apr 14, 2023, 7:05 AM IST

Tunisia Migrants Drown : ట్యునీషియాలో విషాదం నెలకొంది. మధ్యదరా సముద్రంలో వలసదారులతో వెళుతున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మంది ఆఫ్రికన్‌ వలసదారులు మృతి చెందారు. మరో 15 మంది గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన కోస్ట్​గార్డ్ సిబ్బంది.. 72 మందిని సురక్షితంగా రక్షించగలిగింది. బుధవారం పది మృతదేహాలను కోస్ట్​గార్డ్ సిబ్బంది వెలికితీశారు. బోటు కింద చిక్కుకుపోయిన 15 మంది మృతదేహాలను గురువారం వెలికితీశారు. బాధితులంతా ఆఫ్రికాలోని సబ్​-సహారాకు చెందినవారని అధికారులు తెలిపారు.

ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం మధ్యధరా సముద్రం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గం అని తెలిపింది. అయితే మధ్యధర సముద్రాన్ని దాటి ఐరోపా దేశాలకు​ చేరేందుకు వలసదారులను స్మగ్లర్లు చిన్న పడవల్లో తరలిస్తుంటారు. దాంతో వారు సముద్రం దాటుతుండగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వందలాది మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోతుంటారు.

మూడు వారల కిందే 29 మంది మృతి..
మూడు వారాల క్రితం కూడా టునీషియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు సముద్రంలో పడవ మునగడం వల్ల 29 మంది వలసదారులు మృతి చెందారు. మరో 67 మంది గల్లంతయ్యారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. కొందరిని సురక్షితంగా కాపాడారు. మరికొందరి మృతదేహాలను వెలికితీశారు. బాధితులంతా ఆఫ్రికాకు చెందిన వారు.

ఇటలీలో పడవ ప్రమాదం.. 30 మంది మృతి..
గత నెలలో ఇటలీలోను పడవ ప్రమాదం జరిగింది. అయోనియన్ సముద్రంలో పడవ మునిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో బోటులో 100 మంది వలసదారులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన కోస్టు ​గార్డు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బోటు ప్రమాదంలో దాదాపు 40 మంది ప్రయాణికులను అధికారులు వెలికితీశారు. మృతుల్లో నెలల చిన్నారి కూడా ఉంది.

సిరియా వెళుతున్న వలసదారుల పడవ బోల్తా.. 86 మంది దుర్మరణం..
కొద్ది నెలల క్రితం లెబనాన్‌ నుంచి సిరియా వెళుతున్న వలసదారుల పడవ బోల్తాపడింది. ఘటనలో చిన్నపిల్లలు సహా 86 మంది మరణించారు. మృతిచెందిన వారంతా లెబనాన్‌, సిరియా దేశాలకు చెందినవారు. ప్రమాద సమయంలో పడవలో 150 మందికిపైగా వలసదారులు ఉన్నారు. దాదాపు 50 మందికిపైగా వలసదారులు గల్లంతయ్యారు.

ఐరోపాకు వెళ్తున్న బోటు బోల్తా
ఆఫ్రికా దేశం సెనెగల్‌లో ఐరోపాకు వెళ్తున్న బోటు సముద్రంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతిచెందారు. దక్షిణ కాసామాన్స్ ప్రాంతంలోని కఫౌంటైన్ సమీపంలో ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో బోటులో దాదాపు 150 మందికి పైగా ఉన్నారు. వీరిలో 91 మందిని అధికారులు కాపాడారు. మరో 40 మందికి పైగా గల్లంతయ్యారు.

Last Updated : Apr 14, 2023, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details