తెలంగాణ

telangana

ETV Bharat / international

Trump Biden Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ X బైడెన్​.. 10 పాయింట్ల తేడాతో ఆయనే ముందంజ! - vivek ramaswamy polls

Trump Biden Polls : వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు మాజీ డొనాల్డ్ ట్రంప్​ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఓ పోల్​లో తేలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ కంటే బైడెన్​ 10 పాయింట్లు వెనకబడినట్లు వాషింగ్టన్ పోస్ట్‌, ABC న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన పోల్‌ వెల్లడించింది.

trump biden polls
trump biden polls

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 9:33 AM IST

Updated : Sep 25, 2023, 10:07 AM IST

Trump Biden Polls :2024 నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తాజాగా నిర్వహించిన పోల్‌లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వెనకబడ్డారు. డొనాల్డ్‌ ట్రంప్‌తో పోల్చితే బైడెన్‌ 10 పాయింట్లవరకూ వెనకబడినట్లు వాషింగ్టన్ పోస్ట్‌, ABC న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన పోల్‌ వెల్లడించింది. 51-42 తేడాతో బైడెన్‌ కంటే ట్రంప్‌ ముందున్నట్లు ఆ పోల్ పేర్కొంది. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో మిగిలినవారి కంటే ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నారు.

రిపబ్లికన్‌ పార్టీ అధికారిక నామినేషన్‌ ప్రక్రియ అయోవా కాకస్‌, న్యూహాంప్‌ షైర్‌ ప్రైమరీతో జనవరిలో మొదలుకానుంది. ట్రంప్‌తో పాటు రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీచేసేందుకు భారత సంతతికి చెందిన నిక్కీహేలీ, వివేక్ రామస్వామి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వారికి ఆదరణ పెరిగినప్పటికీ ట్రంప్‌ వారికంటే చాలా ముందున్నట్లు సమాచారం. ఆయనే రిపబ్లికన్ పార్టీ అధికారిక అధ్యక్ష అభ్యర్థి అవుతారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

Vivek Ramaswamy Polls :ఇటీవల నిర్వహించిన జీవోపీ పోల్స్​లోరిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో వివేక్‌ రామస్వామి దూసుకెళ్తున్నట్లు తేలింది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్‌ తర్వాతి స్థానానికి వివేక్ రామస్వామి చేరుకున్నారు. దీని ప్రకారం.. రామస్వామి మూడోస్థానం నుంచి ద్వితీయ స్థానానికి ఎగబాకినట్లు స్థానిక మీడియా కథనాలు వివరించాయి. ఈ రేసు కోసం జరుగుతున్న ప్రాథమిక పోల్స్‌లో 39 శాతం మంది మద్దతుతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు. 13 శాతం మద్దతుతో వివేక్‌ రామస్వామి ద్వితీయ స్థానానికి చేరారు. దీంతో ట్రంప్‌నకు ఆయనే ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశముంది. మరోవైపు భారత సంతతికి చెందిన మహిళా అభ్యర్థి నిక్కీహెలీ సైతం 12 శాతం ఓట్లతో తృతీయ స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ట్రంప్‌నకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డీశాంటిస్‌ రెండు స్థానాలు దిగజారి.. అయిదో స్థానానికి పడిపోయారు. గత జులైలో 26 శాతం ఓటర్ల మద్దతుతో ద్వితీయస్థానంలో ఉన్న డిశాంటిస్‌ ప్రస్తుతం కేవలం 6 శాతం మద్దతుకే పరిమితమయ్యారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Sep 25, 2023, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details