Trains Collide Spain: స్పెయిన్‌లో భారీ ప్రమాదం తప్పింది. బార్సిలోనాకు సమీప స్టేషన్‌లో ఆగిఉన్న ఓ ప్రయాణికుల రైలును వెనకనుంచి వచ్చిన మరో రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 155 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. వారిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా.. 39 మందిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రమాద సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
ఆగి ఉన్న ట్రైన్‌ను ఢీకొట్టిన మరో రైలు.. 155 మందికి గాయాలు - స్పెయిన్‌లో భారీ ప్రమాదం
ఆగి ఉన్న ఓ ప్రయాణికుల రైలును వెనక నుంచి వచ్చిన మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 155 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
స్పెయిన్
ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన రవాణా శాఖ మంత్రి రాకెల్ సాంషెజ్.. ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాద తీవ్రత పక్కనబెడితే అదృష్టవశాత్తు ప్రాణనష్టం కలగకపోవడం ఉపశమనం కలిగించే విషయమన్నారు. అయినప్పటికీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రయాణికులకు హామీ ఇచ్చారు.