తెలంగాణ

telangana

ETV Bharat / international

కుబేరుల ప్రాణాలు తీస్తున్న టైటానిక్! అప్పట్లో బామ్మను కోల్పోయి.. ఇప్పుడు భర్తను.. - titanic ship details

Titanic richest passengers : చరిత్రలో అతిపెద్ద నౌకా విషాదాల్లో ఒకటి టైటానిక్ షిప్ మునిగిపోవడం. 110 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో 1,500 మంది ప్రాణాలు కోల్పోగా... ఆ నౌక ఇప్పటికీ నర బలి తీసుకుంటూనే ఉంది. అత్యంత సంపన్నుల కోసం నిర్మించిన ఈ నౌక... ఇంకా కుబేరుల ప్రాణాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా టైటానిక్‌ ఓడను చూసేందుకు వెళ్లి చనిపోయినవారిలో ఐదుగురూ ధనవంతులే.

Titanic richest passengers
Titanic richest passengers

By

Published : Jun 23, 2023, 4:00 PM IST

Titanic richest passengers : హాలీవుడ్‌లో తెరకెక్కిన అందమైన ప్రేమ కావ్యాల్లో ఒకటి టైటానిక్ చిత్రం. 1912లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వాస్తవానికి 1912లో టైటానిక్‌ షిప్‌లో 2,224 మంది ప్రపంచ యాత్ర చేపట్టారు. వీరిలో ఎక్కువ మంది సంపన్నులే. అత్యంత విలాసవంతమైన ఈ ఓడలో జీవితానికి సరిపడినన్ని మధురానుభూతులను సొంతం చేసుకుందామనే భావనతో యాత్రకు బయలుదేరారు. అయితే 1912 ఏప్రిల్‌ 14న అట్లాంటిక్‌ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీకొట్టి టైటానిక్‌ మునిపోయింది. ఆ ఘటనలో 1,500 మంది జలసమాధి అయ్యారు.

Titanic ship death : ఆ నౌక మునిగిపోయే సమయంలో ఇడా స్ట్రాస్‌ అనే మహిళకు ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం లభించింది. కొందరు మహిళలు, చిన్నారులను లైఫ్‌బోట్‌ సాయంతో రక్షిస్తుండగా... ఆమెను కూడా నౌక నుంచి తీసుకురావాలని చూసినా కుదరలేదు. తన భర్త వెంట రాకుండా తాను రాలేనని అక్కడే ఉండిపోయారు. భర్తతోపాటు ఆమె కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ జంట వారసురాలే వెండీ రష్‌. స్ట్రాస్‌ దంపతుల కుమార్తెల్లో ఒకరైన మిన్నీకి ఆమె మునిమనుమరాలు. గత రెండేళ్లలో టైటానిక్ శిథిలాలను వీక్షించడానికి వెళ్లిన మూడు ఓషన్‌ గేట్ యాత్రల్లో ఆమె పాల్గొన్నారు. ఓషన్ గేట్ ఈ మినీ జలంతర్గామిని నిర్వహిస్తోంది.

నీటి అడుగున ఓషన్​గేట్ సబ్​మెరైన్ (పాత చిత్రం)
సముద్రం లోపలికి వెళ్లే ముందు సబ్​మెరైన్ చిత్రం (ఆదివారం నాటిది)

టైటానిక్​కు కుటుంబ సభ్యుల బలి
Oceangate CEO stockton rush : తాజాగా, ఓషన్‌ గేట్‌ చేపట్టిన మినీ జలాంతర్గామి టైటాన్ యాత్ర విషాదాంతమై ఐదుగురు సంపన్నులు ప్రాణాలు కోల్పోయారు. జలాంతర్గామిని నడిపిన పైలట్‌, ఓషన్‌గేట్‌ సీఈఓ స్టాక్టన్‌ రష్ భార్యే వెండీ రష్. గతంలో టైటానిక్‌ విషాదాంతంలో కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వెండీ రష్.. తాజాగా ఆ శకలాలను చూడడానికి వెళ్లిన తన భర్తను కూడా కోల్పోయారు. సాహసయాత్రగా భావించి టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన వారు మృత్యువాత పడ్డారు.

ఓషన్​గేట్ సబ్​మెరైన్​లోకి దిగుతున్న స్టాక్టన్ రష్ (2018 నాటి చిత్రం)
ఓషన్​గేట్ సబ్​మెరైన్

James Cameron titanic dive : మరోవైపు, టైటానిక్ చిత్రాన్ని తెరకెక్కించిన జేమ్స్‌ కామెరూన్‌ కూడా ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో అది ఒకటి అని టైటానిక్‌ మునిగిపోయిన ప్రాంతాన్ని ఒక్క ముక్కలో చెప్పేశారు. సాహసాలంటే ఇష్టపడే కామెరూన్‌.. సముద్రంలో మునిగిపోయిన 'టైటానిక్‌' షిప్‌ ప్రాంతాన్ని ఇప్పటివరకూ 33సార్లు సందర్శించారు. 13వేల అడుగుల లోతున ఉండిపోయిన చరిత్ర సజీవ సాక్ష్యాన్ని ఆయన డాక్యుమెంటరీ రూపంలోనూ తీసుకొచ్చారు.

టైటానిక్ చిత్రం డైరెక్టర్ జేమ్స్ కామెరూన్

James Cameron submarine : తాజా ఘటనపై స్పందించిన ఆయన.. టైటానిక్ విపత్తు మాదిరిగానే దీని గురించి తెలియగానే షాక్​కు గురైనట్లు చెప్పారు. 'ఎదురుగా భారీ మంచు కొండ ఉందని హెచ్చరించినా టైటానిక్ కెప్టెన్ వినలేదు. అమావస్య రోజు చిమ్మ చీకట్లో నౌకను వేగంగా పోనిచ్చాడు. చాలా మంది చనిపోయారు. ఇప్పుడు జరిగిన విషాదం కూడా అచ్చం అలాంటిదే. హెచ్చరికలను వినకుండా లోపలికి వెళ్లారు. ఈ ప్రమాదం బాధాకరం' అని పేర్కొన్నారు.

సహాయక చర్యల్లో పాల్గొన్న పడవలు- ఉపగ్రహ చిత్రం

ABOUT THE AUTHOR

...view details