Artemis I launch : అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. రాకెట్‌లో ఇంధన లీకేజీని అరికట్టడంలో ప్రయత్నాలు సఫలం కాకపోవడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా తెలిపింది. అయితే, తిరిగి మళ్లీ ఎప్పుడు ప్రయోగిస్తామనే వివరాలను వెల్లడించలేదు. కాగా.. ఇంజిన్ నంబర్-3లో లీకేజీ సమస్య వల్ల రాకెట్ లాంఛ్‌ను తొలుత వాయిదా వేసింది. తిరిగి సెప్టెంబర్ 3న ప్రయోగిస్తున్నట్లు వెల్లడించగా తాజాగా మళ్లీ వాయిదా పడింది.
నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా
21:01 September 03
నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా
అపోలో ప్రాజెక్టు తర్వాత 50 ఏళ్లకు మరోసారి చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది. అంతకుముందు ఆగస్టు 29న ఫ్లోరిడాలోని నాసా కెనెడీ అంతరిక్ష కేంద్రంలో లాంచ్‌పాడ్‌పై రాకెట్‌ను ఉంచారు. లాంచ్‌పాడ్‌ను ఐదు పిడుగులు తాకినా రాకెట్‌కుగాని, ఓరియన్ క్యాప్సూల్‌కుగాని ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, రాకెట్ ప్రయోగానికి గంటల ముందు లాంఛ్ సిస్టమ్ రాకెట్‌లో ఇంధనం లీక్ అయినట్లు సమాచారం అందింది. సూపర్ కోల్డ్ హైడ్రోజన్, ఆక్సిజన్ లీక్ అవ్వడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేశారు. పిడుగల కారణంగా నిర్దేశించిన సమయం కంటే ఇంధన సరఫరా గంట ఆలస్యంగా నడిచింది. అనంతరం, రిహార్సల్స్ నిర్వహించగా ఆ సమయంలోనే ఇంధన లీకేజీ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వాల్వ్లోనూ లీకేజీలు ఏర్పడ్డాయి. ఉదయం, నాలుగు ప్రధాన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకు ఉన్న ప్రాంతంలో పగుళ్లు లేదా లోపాలు గుర్తించినట్లు నాసా అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయోగాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు.
ఇవీ చదవండి:విమానంతో ఢీకొడతానని వాల్‌మార్ట్‌కు బెదిరింపు.. స్టోర్ ఖాళీ
పోలీసు వాహనంపై దాడి.. 8 మంది మృతి.. నది దాటుతూ మరో ఎనిమిది మంది