Thailand Ayutthaya Temple : థాయ్‌లాండ్‌లోని అయుతయ ప్రాంతాన్ని అయోధ్యగా పిలుస్తారు. ఈ ప్రదేశానికి అయోధ్య అని పేరు పెట్టడమే కాదు.. చరిత్రలో కూడా ఈ రెండు ప్రదేశాల మధ్య కొన్ని దగ్గరి పోలికలున్నాయి. అయుతయ రాజవంశంలోని ప్రతి రాజునూ శ్రీరాముని అవతారంగా కొలుస్తారు. రాజుల పేరులో రామ అనే పదాన్ని చేర్చుకోవడం ఇక్కడి తరతరాల సంప్రదాయం. రామాయణంలో అయోధ్య రాముని రాజధానిగా పేర్కొన్నారు. అయితే సయామీ పాలకుల కాలంలో అయుతయాని కూడా రాజధానిగా ప్రస్తావించారు.
క్రీస్తు శకం 1351 నుంచి సయామీ పాలకుల రాజధానిగా ఉన్న అయుతయను.. 1767లో బర్మా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. హిందూ ఇతిహాసాల్లోని రామాయణంలాగే థాయ్‌లాండ్ రామాయణం పేరు రామకియాన్. దీన్ని 18వ శతాబ్దంలో.. కింగ్ రామ ఒన్ రచించారని నమ్ముతారు. ఈ గ్రంథం గురించి 300 రామాయణం అనే పుస్తకంలో వాల్మీకి రాసిన రామాయణంతో పోల్చారు. రామాయాణంలోని రావాణాసురుడిలాగే ఈ పుస్తకంలోని ప్రత్యర్థి పేరు థోత్సకన్. మనం శ్రీరామ్‌గా ఆరాధించే పేరును థాయ్ వాసులు ఫ్రారామ్‌గా ఆరాధిస్తారు. ప్రస్తుతం అయుతయ నగరాన్ని యునెస్కో గుర్తించి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది.