తెలంగాణ

telangana

ETV Bharat / international

'నేను అనుమానాస్పదంగా మరణిస్తే..'- రష్యాకు గురిపెడుతూ మస్క్​ ట్వీట్​! - ట్విట్టర్​ సీఈఓ

Tesla CEO Elon Musk: టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​.. తాజాగా చేసిన ఓ ట్వీట్​ సంచలనంగా మారింది. 'అనుమానాస్పద మరణం' అంటూ చేసిన ట్వీట్​ చర్చకు దారి తీసింది. ఆ ట్వీట్​ వెనక ఉన్న ఆంతర్యమేమిటి? రష్యా నుంచి మస్క్​కు ప్రాణహాని ఉందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Tesla CEO Elon Musk Mysterious death tweet
టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్

By

Published : May 9, 2022, 8:30 AM IST

Tesla CEO Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్​.. ఇటీవలే ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్​ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొకకోలా, మెక్​డొనాల్డ్​ వంటి ప్రముఖ సంస్థలను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్​ చేసి షాక్ ఇచ్చారు. ఇలా ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు మస్క్​. తాజాగా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణంపై.. మస్క్​ చేసిన మరో ట్వీట్​ చర్చకు దారితీసింది.

" నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం."

- ఎలాన్​ మస్క్​, టెస్లా సీఈఓ

ఈ పోస్టుకు ఒక గంట ముందు.. 'ఉక్రెయిన్​లోకి ఫాసిస్ట్​ దళాలతో పాటు కమ్యూనికేషన్​ సామగ్రిని పంపించటంలో మీ భాగస్వామ్యం ఉంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది.' అంటూ రష్యన్​ అధికారి పంపిన సందేశాన్ని షేర్​ చేశారు మస్క్​. ఈ సామగ్రి ఉక్రెయిన్​కు పెంటగాన్​ పంపించినట్లు పేర్కొన్నారు రష్యన్​ అధికారి.

ఈ రెండు పోస్టులతో.. యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్​కు సాయం చేయటం వల్ల మస్క్​కు రష్యా నుంచి బెదిరింపులు వస్తున్నాయా? అనే విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఉక్రెయిన్​లో స్పేస్​ఎక్స్​ స్టార్​లింక్​ శాటిలైట్​ బ్రాడ్​బాండ్​ సేవలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. యుద్ధం జరుగుతున్న క్రమంలో శాటిలైట్​ బ్రాడ్​బాండ్​ సేవలు ప్రారంభించటంపై రష్యా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌కు మస్క్‌ సాయం.. ఏం చేశారంటే?

సాయంలో మస్క్ రికార్డ్- పిల్లల కోసం 570 కోట్ల డాలర్ల షేర్లు విరాళం!

ABOUT THE AUTHOR

...view details