టాంజానియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దార్ ఎస్ సలాం నగరం నుంచి బయలుదేరిన ప్రిసీషన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు.
ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 26 మందిని కాపాడామని అధికారులు తెలిపారు. మిగతావారి కోసం గాలింపుచర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వంద మీటర్ల ఎత్తులో విమానం ఉండగా వర్షం కురవడం సహా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది.
సరస్సులో కుప్పకూలిన విమానం.. 19 మంది దుర్మరణం - సరస్సులో కుప్పకూలిన విమానం
టాంజానియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు.
Etv Bharat