Sweden NATO membership: 200ఏళ్ల పాటు సైనికపరంగా అలీన విధానం అనుసరించిన స్వీడన్.. చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఫిన్లాండ్ తరహాలోనే తాము నాటో సభ్యత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు స్వీడన్ ప్రధాని మాగ్దలీనా అండర్సన్ ప్రకటించారు. అధికారికంగా నాటోలో చేరడమే కాకుండా.. రక్షణ పరమైన హామీలు సైతం తమకు కావాలని మాగ్దలీనా స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా సేనలు విరుచుకు పడుతున్న నేపథ్యంలో స్వీడన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sweden NATO status: నాటోలో చేరే విషయంపై సోమవారం స్వీడన్ పార్లమెంట్లో చర్చ జరగ్గా.. మెజార్టీ సభ్యులు ఇందుకు మద్దతు పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయకముందు స్వీడన్, ఫిన్లాండ్ దేశంలోని ప్రజలు.. నాటోలో చేరడాన్ని వ్యతిరేకించారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో.. ఈ రెండు దేశాల ప్రజలు నాటోలో చేరడమే తమ దేశానికి మేలు అని భావిస్తున్నారని పలు సర్వేల్లో వెల్లడైంది.