తెలంగాణ

telangana

ETV Bharat / international

లంకలో దయనీయ పరిస్థితులు​.. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు బంద్​.. - Sri Lanka Crisis

Sri Lanka Fuel Crisis: శ్రీలంకలో సోమవారం నుంచి ప్రభుత్వ రంగంలోని కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సుదీర్ఘమైన విద్యుత్తు కోతల కారణంగా ఈ నిర్ణయంతీసుకున్నట్లు డైలీ మిర్రర్‌ దినపత్రిక పేర్కొంది.

Sri Lanka Crisis
లంకలో దయనీయ పరిస్థితులు​.. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు బంద్​..

By

Published : Jun 18, 2022, 7:03 PM IST

Sri Lanka Crisis: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో సోమవారం నుంచి ప్రభుత్వ రంగంలోని కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొలంబొ నగర పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో వచ్చేవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని శ్రీలంక విద్యా శాఖ ఉపాధ్యాయులను ఆదేశించింది. సుదీర్ఘమైన విద్యుత్తు కోతల కారణంగా ఈ నిర్ణయంతీసుకున్నట్లు డైలీ మిర్రర్‌ దినపత్రిక పేర్కొంది.

ప్రస్తుతమున్న ఇంధన నిల్వలు వేగంగా తగ్గిపోతుండటంతో చమురు దిగుమతులకు విదేశీ మారకద్రవ్యం చెల్లించే విషయంలో శ్రీలంక తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆర్థికవ్యవస్థకు చెందిన అనేక రంగాలు స్తంభించిపోయాయి. ఫలితంగా పెట్రోల్‌ బంకుల ముందు గంటలకొద్దీ బారులుతీరాల్సి వస్తుండటంతో ఇప్పటికే శ్రీలంకవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తీవ్రమైన ఇంధన పరిమితుల దృష్ట్యా ప్రభుత్వ రవాణా వ్యవస్థలు, ప్రైవేటు వాహనాలను ఉపయోగించటం దుర్బరంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యోగులు కనీస సంఖ్యలో మాత్రమే హాజరుకావాలని పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, హోం శాఖలు తమ సర్క్యులర్లలో పేర్కొన్నాయి. అయితే వైద్య శాఖ ఉద్యోగులు మాత్రం యథావిధిగా తమ విధులకు హాజరుకావాలని స్పష్టం చేశాయి. శ్రీలంకలో గత కొన్నినెలలుగా రోజుకు 13 గంటలకుపైగా విద్యుత్తుకోతలు అమలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:పాక్ 'మక్కీ'కి చైనా అండ.. గ్లోబల్​ టెర్రరిస్ట్​గా గుర్తించేందుకు మోకాలడ్డు

ABOUT THE AUTHOR

...view details