దేశంలో సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్స రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అధ్యక్షుడు గొటబయా రాజపక్సకు తన రాజీనామాను అందించినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే, ఈ వార్తలను కొట్టిపారేసింది ప్రధానమంత్రి కార్యాలయం. మహీంద రాజపక్స రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. అవి తప్పుడు వార్తలుగా పేర్కొంది. రాజీనామాపై వస్తున్న వార్తలను ప్రధాని మహిందా రాజపక్స మీడియా సెక్రటరీ తిరస్కరించారు.
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా? - Lanka PM resigns
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజాగ్రహం మొదలైంది. పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న క్రమంలో ప్రస్తుత పరిస్థితని చక్కదిద్దేందుకు ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజమెంత?
Sri Lanka protests: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి అధ్యక్షుడి ఇంటిని వారు ముట్టడించారు. ఆదివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంక్షోభం తమ నిర్ణయాల ఫలితం కాదని.. కరోనా మహమ్మారి మూలంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని తమ చర్యలను సమర్థించుకున్నారు.