తెలంగాణ

telangana

ETV Bharat / international

గొటబాయకు షాక్​.. 'ప్రభుత్వం' ఏర్పాటుకు ప్రతిపక్షం నో - గొటబాయకు ఎదురుదెబ్బ

Srilanka SJB Party Rejects Offer: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇచ్చిన పిలుపును ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ తిరస్కరించింది. దేశంలో అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను తోసిపుచ్చింది.

srilanka jcb party rejects goyabaya offer
srilanka jcb party rejects goyabaya offer

By

Published : May 9, 2022, 6:46 AM IST

Srilanka SJB Party Rejects Offer: శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిందిగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స చేసిన ప్రతిపాదనను ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవేగే (ఎస్‌జేబీ) తిరస్కరించింది. తమ నేత సాజిత్‌ ప్రేమదాస పగ్గాలు స్వీకరించాల్సిందిగా అధ్యక్షుడు చేసిన అభ్యర్థనను తాము అంగీకరించడం లేదని ఆ పార్టీ ఆదివారం పేర్కొంది. అయితే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా శనివారం ప్రేమదాసను కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సిందిగా కోరారు.

అధ్యక్ష స్థానం నుంచి గొటబాయ రాజపక్స, ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స వైదొలిగితేనే తమ పార్టీ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తుందని ప్రేమదాస ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు ఈ రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికేందుకు బార్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ శ్రీలంక (బీఎఎస్‌ఎల్‌) ప్రతిపాదించిన 11 సూత్రాల ప్రణాళికను పరిశీలించాలని అధ్యక్షుడు గొటబాయ భావిస్తున్నారు. రాజ్యాంగ పరిధిలో ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పరిశీలిస్తారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

.

ఇదీ చదవండి:చైనా విధేయుడికే హాంకాంగ్​ పగ్గాలు.. కొత్త అధిపతిగా జాన్​ లీ ఎన్నిక

ABOUT THE AUTHOR

...view details