దక్షిణాఫ్రికాలోని ఓ బార్లో కాల్పులు జరగ్గా 15 మంది మరణించారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. జోహెన్నస్బర్గ్లోని సెవేటో టౌన్షిప్లో ఈ ఘోరం జరిగింది. కొందరు దుండగులు మినీ బస్లో వచ్చి, బార్లోకి చొరబడి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. శక్తిమంతమైన తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
బార్లో భీకర దాడి.. బస్లో వచ్చి బులెట్ల వర్షం.. 15 మంది మృతి - దక్షిణాఫ్రికా బార్లో కాల్పులు
12:49 July 10
బార్లో కాల్పులు.. 15 మంది మృతి
"ప్రాథమిక సమాచారం ప్రకారం కొంత మంది వ్యక్తులు చేసినట్లు భావిస్తున్నాం. అకస్మాత్తుగా తుపాకీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరిగెత్తారు. నిందితుల లక్ష్యం తెలియదు. శక్తిమంతమైన తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు."
-ఇలియాస్ మవేలా, పోలీస్ కమిషనర్
పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతానికి దుండగుల ఉద్దేశం ఏమిటనేది తెలియదని పోలీస్ కమిషనర్ ఇలియాస్ మవేలా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ఘనంగా 'గే' యువరాజు పెళ్లి.. వారి కోసం ఆసియాలోనే తొలి ఆశ్రమం!