Son Killed Father: సొంత తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ తనయుడు. 52 ఏళ్ల వయసున్న తండ్రిని ముక్కముక్కలుగా చేసి చంపాడు. అనంతరం శరీర భాగాలను వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్లి వాటికి నిప్పింటించాడు. ఈ అమానుష ఘటన పాకిస్థాన్లోని కరాచీలో వెలుగుచూసింది. ఈ కేసులో కుమారుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సుత్తితో కొట్టి తండ్రిని హత్య చేశాడని.. తర్వాత శరీర భాగాలను ముక్కముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో వదిలి వెళ్లినట్లు చెప్పారు.
"నా సుదీర్ఘ కెరీర్లో ఇది అత్యంత భయంకరమైన సంఘటన. తండ్రి కొడుతున్నాడనే కారణంతో అతడిని చంపడం అత్యంత దారుణం. తన తండ్రి అని ఏవరు గుర్తు పట్టకూడదు అనుకున్నాడు. ఏప్రిల్ 21న సుత్తితో కొట్టి హత్య చేసి ముక్కుముక్కలుగా చేసి వివిధ ప్రదేశాల్లో పడేశాడు. ఎవరూ గుర్తుపట్టకుండా శరీరభాగాలకు నిప్పంటించాడు. కానీ కొద్ది రోజుల క్రితం అఫ్గాన్ బస్తీ వద్ద శరీర భాగాలను గుర్తించడం వల్ల అసలు విషయం బయటపడింది."