Somalia Bombing 2023 :పేలుడు పదార్థాలతో ఉన్న ఓ వాహనం దూసుకురావడం వల్ల భద్రతా చెక్‌పోస్టు వద్ద పేలుడు సంభవించింది. మధ్య సోమాలియాలోని బెలెడ్‌వెయిన్ నగరంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. మరో 40 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులు వెల్లడించారు.
Somalia Bomb Blast :"పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కు.. ప్రభుత్వం ఆధీనంలోని చెక్‌పోస్ట్‌పైకి దూసుకువచ్చింది. భద్రత అధికారులు వాహనం దాన్ని వెంబడిస్తుండగా ఒక్కసారిగా అది పేలింది" అని ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి అబ్దికదిర్ అర్బా తెలిపారు. పేలుడు జరిగినప్పుడు ప్రమాద స్థలానికి తాను 200 మీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
తూర్పు ఆఫ్రికాలో అల్‌ఖైదాకు అనుబంధ సంస్థగా ఉన్న అల్ షబాబ్ తీవ్రవాదులపై సోమాలియా ప్రభుత్వం ఇటీవలే సైనిక దాడి చేపట్టింది. కాగా తాజా పేలుడుకు బాధ్యత వహిస్తూ అల్ షబాబ్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా రాజధాని.. 100 మంది మృతి
కొద్ది రోజుల క్రితం కూడా సోమాలియా రాజధానిలో ఒక్కసారిగా రెండు చోట్ల భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. ఘఠన జరిగింది. పేలుళ్లలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.