తెలంగాణ

telangana

ETV Bharat / international

షూటింగ్ రేంజ్​లో కాల్పులు.. ముగ్గురు మృతి.. 40గన్స్ చోరీ! - us shooting 2022 gun range

Shooting in US gun range: అమెరికాలో కాల్పులు కలకలరం రేపాయి. ఓ షూటింగ్ రేంజ్​లో చొరబడి దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు 40 తుపాకులు ఎత్తుకెళ్లాడు.

Shooting in US gun range
Shooting in US gun range

By

Published : Apr 10, 2022, 7:58 AM IST

Shooting in US gun range: అమెరికా గ్రాంట్​విల్​లోని ఓ షూటింగ్ రేంజ్​లో కాల్పులు జరిగాయి. ఓ దుండగుడు చేసిన కాల్పుల్లో గన్ రేంజ్ యజమాని, ఆయన భార్య, మనవడు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి 40 ఆయుధాలను దోచుకెళ్లాడని గ్రాంట్​విల్ పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని చెప్పారు. రాత్రి 8 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. 'లాక్ స్టాక్ అండ్ బ్యారెల్' షూటింగ్ రేంజ్ యజమాని థామస్ హాక్(75) మృతదేహాన్ని గుర్తించారు. అతడి భార్య ఎవెలిన్(75), ల్యూక్(17) శవాలు పక్కనే పడి ఉన్నట్లు తెలిపారు.

షూటింగ్ రేంజ్

Grantville gun range shooting:'వేసవి సెలవుల నేపథ్యంలో ల్యూక్ తన తాత ఇంటికి వచ్చాడు. షూటింగ్ రేంజ్​లో తాతకు సహకరించేవాడు. హాక్ కుటుంబం 30 ఏళ్లుగా ఈ షూటింగ్ రేంజ్ నిర్వహిస్తోంది. ఇక్కడ స్థానికంగా వీరికి మంచిపేరు ఉంది. సాయంత్రం 5.30 గంటలకు ఈ ఘటన జరిగింద'ని పోలీసులు వివరించారు. సాధారణంగా ఆ సమయంలో గన్ రేంజ్ మూసి ఉంటుందని చెప్పారు. హాక్ కుమారుడు రిచర్డ్ ఘటన సమయంలో బయటకు వెళ్లాడని తెలిపారు. మృతదేహాలను అతడే ముందుగా గుర్తించాడని స్పష్టం చేశారు.

అయితే, ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియలేదు. గన్ రేంజ్ నుంచి 40 తుపాకులు గల్లంతైనట్లు గుర్తించారు. సీసీటీవీ కెమెరాలను సైతం దొంగలించారు. భారీగా ఆయుధాలు తీసుకొని పారిపోయిన నేపథ్యంలో పోలీసులు.. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితుల వివరాలు తెలియజేసినవారికి రూ.11.40 లక్షల(15 వేల డాలర్లు) నగదు అందిస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి:'సంక్షోభం నుంచి బయటపడాలంటే.. 300 కోట్ల డాలర్లు కావాలి'

ABOUT THE AUTHOR

...view details