తెలంగాణ

telangana

ETV Bharat / international

కెనడాలో కాల్పుల కలకలం.. నిందితుడుతో సహా ఆరుగురు మృతి - సాయుధు జరిపిన కాల్పులు

Shooting In Canada 2022 : కెనడాలో కాల్పులు కలకలం రేపాయి. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.

Toronto area condo shooting
కెనడాలో కాల్పులు

By

Published : Dec 19, 2022, 12:43 PM IST

Shooting In Canada 2022 : కెనడాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపగా అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ఒంటారియోలోని టొరంటో శివారులో ఉన్న ఓ కండోమినియం యూనిట్​లో ఈ కాల్పులు జరిగినట్లు జేమ్స్​ మాక్​స్వీన్​ అనే ఓ పోలీసు అధికారి తెలిపారు.

నిందితుడు గన్​తో వచ్చి ఒక్కసారిగా యూనిట్​లో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డారని.. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు జేమ్స్​ తెలిపారు. నిందితుడు వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details