తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా నైట్‌క్లబ్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు - అమెరికా నైట్‌క్లబ్‌లో కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. స్వలింగ సంపర్కుల కోసం ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు.

Shooting in America nightclub
అమెరికాలో స్వలింగ సంపర్కుల నైట్‌క్లబ్‌పై కాల్పులు

By

Published : Nov 20, 2022, 7:18 PM IST

Updated : Nov 20, 2022, 8:18 PM IST

అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. కొలరాడోలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. కొలరాడో స్ప్రింగ్స్‌ శివారులోని క్లబ్‌ క్యూలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీస్‌ లెఫ్టినెంట్ పమేలా కాస్ట్రో వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఘటనాస్థలాన్ని చుట్టుముట్టారని ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా రాత్రి 11:57 నుంచి 911 కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు.

ఈ నైట్‌క్లబ్‌ను ప్రత్యేకంగా స్వలింగ సంపర్కుల కోసం నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. తాజా ఘటనపై సామాజిక మాధ్యమాల వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్వలింగ సంపర్కులు ఇది తమ సమాజంపై జరిగిన ద్వేషపూరిత దాడిగా అభివర్ణించారు. మరోవైపు పోలీసులు ఈ ఘటన వెనుక కారణాలు, ఆయుధ వివరాల వంటి సమాచారం వెల్లడించలేదు. గతంలోనూ ఓర్లాండోలోని ఓ స్వలింగ సంపర్కుల నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 49 మంది మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అక్కడే హతమార్చారు

Last Updated : Nov 20, 2022, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details