తెలంగాణ

telangana

ETV Bharat / international

టోక్యోకు షింజో అబే భౌతికకాయం.. సంచలనాలు వెల్లడించిన హంతకుడు!

Shinzo Abe death: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతదేహాన్ని టోక్యోకు తరలించారు. నేతలు, ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని అబే నివాసానికి తీసుకొచ్చారు. మరోవైపు, హత్య చేసిన నిందితుడి నుంచి పోలీసులు పలు విషయాలు రాబట్టారు.

shinzo-abe-dead-body-arrives-in-tokyo
shinzo-abe-dead-body-arrives-in-tokyo

By

Published : Jul 9, 2022, 12:32 PM IST

Shinzo abe dead body: శుక్రవారం హత్యకు గురైన జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే భౌతిక కాయాన్ని టోక్యోలోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. నరా నుంచి భౌతిక కాయం వెంట ఆయన సతీమణి అకీ అబే వచ్చారు. అబే నివాసంలో నేతలు, ప్రజలు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించనున్నారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై అధికారులు అబే కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు.

అబే మృతదేహం ఉన్న కారు!

మరోవైపు, అబేను హత్య చేసిన టెట్సుయా యమగామిని విచారిస్తున్న పోలీసులు.. పలు విషయాలు రాబట్టారు. అబేకు ముందు ఓ మత సంస్థ నాయకుడిని హత్య చేయాలని ప్రణాళిక రచించినట్లు హంతకుడు పోలీసులకు వివరించినట్లు జపాన్‌ మీడియా తెలిపింది. అబేతో సంబంధం ఉన్న ఆ మత సంస్థపై యమగామికి ద్వేషం ఉన్నట్లు వివరించింది. అబే రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తున్నందున నేరం చేసినట్లు తాను అంగీకరించలేనని అతను తెలిపినట్లు జపాన్ పోలీసులు వెల్లడించారు. పాఠశాల విద్య ముగిసిన తర్వాత జీవితంలో ఏం చేయాలి అనే దానిపై అతనికి స్పష్టత లేదని, అలసిపోయినందున రెండు నెలల క్రితం ఉద్యోగాన్ని వదిలినట్లు జపాన్ టైమ్స్‌ పత్రిక తెలిపింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details