తెలంగాణ

telangana

ETV Bharat / international

వరుస పేలుళ్లు.. ఉగ్ర దాడిలో 14 మంది సైనికులు మృతి

ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన దాడుల్లో 14 మంది మాలి దేశ సైనికులు మృతి చెందారు. 12 మంది పైగా సైనికులు గాయపడ్డారు. బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

soldiers-of-mali-killed-in-terrorist-attack
తీవ్రవాదుల దాడిలో సైనికులు మృతి

By

Published : Jan 12, 2023, 4:46 PM IST

Updated : Jan 12, 2023, 5:42 PM IST

మాలి దేశ సైనికులపై ఇస్లామిక్ తీవ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన దాడిలో 14 మంది సైనికులు మృతి చెందారు. మరో 12 మంది సైనికులు గాయపడ్డారు. సెంట్రల్ మాలిలోని కౌమారా, మాసినా పట్టణాల మధ్య ఈ పేలుళ్లు జరిగినట్లు ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ కల్నల్ సౌలేమనే డెంబెలే తెలిపారు. మరో రెండు గ్రామాల్లో కూడా తీవ్రవాదులు దాడి చేసినట్లు డెంబెలే పేర్కొన్నారు. ఈ వారం మొదట్లో 30 మందికి పైగా ఉగ్రవాదులను మాలి సైనికులు హతమార్చినట్లు డెంబెలే పేర్కొన్నారు.

కాగా పశ్చిమ ఆఫ్రికా దేశం ఒక దశాబ్ద కాలంగా అల్-ఖైదా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రమూకలో చేతిలో సతమతమవుతోంది. వేలాది మంది ప్రజలు వీరి కారణంగా చనిపోయారు. "హింసను అరికట్టడానికి అదనపు సైనికులను నియమించినప్పటికీ, దేశంలో తీవ్రవాదుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తీవ్రవాదాన్ని రూపుమాపాలనే ప్రయత్నం ఫలించడం లేదు." అని ఇంటెలిజెన్స్ అడ్వైజరీ సీఈఓ లైత్ అల్ఖౌరి తెలిపారు. ఈ ఘటన మాలి సైనికుల సంకల్పాన్ని బలహీన పరిచే అవకాశం ఉందని.. ఇలాంటి దాడులు మరిన్ని జరిగితే సైన్యం అదనపు భద్రత చర్యలను చేపట్టవలసి ఉంటుందని ఆయన వెల్లడించారు.

Last Updated : Jan 12, 2023, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details